ఆవిరి పట్టుకుంటే కరోనా తగ్గుతుందా ?

ఆవిరి పట్టుకుంటే కరోనా తగ్గుతుందా ?

 

ఆవిరి పట్టుకుంటే కరోనా తగ్గుతుందా ?
ఎలా పట్టుకోవాలి ,ఎంతసేపు పట్టుకోవాలి , ఆవిరి ఎలా తయారు చేయాలి ...


ప్రస్తుతం భారత దేశం మరియు చాల దేశాలు కోవిడ్ 19 అనే సార్స్ రకానికి చెందిన వైరస్ తో సతమతం అవుతున్నాయి ..

2019 చివరి నెలలో ప్రవేశించిన ఈ వైరస్  2021 లో కూడా తన ప్రభావాన్ని మన మీద చూపుతూనే ఉంది .

ఇప్పుడు ఈ వైరస్ యొక్క రెండో రూపాంతరాన్ని అనుభవిస్తున్నాం , ఇది ఇంతకు ముందు వైరస్ కంటే అతి వేగంగా వ్యాప్తిచెందుతోంది ..దీన్ని అరికట్టే కొన్ని పద్దతులలో ఆవిరి పెట్టుకోవడం ఒకటి 

మనందరికీ తెలిసిందే ఈ వైరస్ మన ఆర్థికమూలలను చిదిమివేసింది , మన అయిన వారిని ఎంతో మందిని కోల్పోయాం కూడా ..

మన భారతీయ పురాతన ఆరోగ్యపు అలవాట్ల తో ఈ వైరస్ యొక్క దృష్ప్రభావాలను అరికట్టవచ్చు .

ఈ వైరస్ యొక్క ప్రధాన లక్షణాలు :

ప్రస్తుతం ఈ వైరస్ రెండో రూపాంతరం చెంది మొదటి రూపాంతరం కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోంది ...

 కరోనా వైరస్   ( రెండవ రూపాంతరం) యొక్క లక్షణాలు :

  • జ్వరం 
  • దగ్గు 
  • కళ్ళు ఎర్రబారటం 
  • జలుబు 
  • గొంతులో నొప్పి , బొంగురు పోవటం 
  • కడుపులో నొప్పి , కడుపు ఉబ్బరం 
  • విరేచనాలు 
  • వాసనను కోల్పోవటం 

కొన్ని సార్లు ఎలాంటి లక్షణాలు కూడా కనపడటం లేదు ..కానీ వారి లోపల వైరస్ ఉండే అవకాశాలు ఉంటున్నాయి .

కరోనాకు సరయిన  చికిత్స ఏంటి ?

కరోనా  వస్తే దానికి తగిన చికిత్స తీసుకోవడం చేయాలి , మొట్ట మొదటగా మన శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వాలు కృషి చేసి దీనికి సూది మందు (వ్యాక్సిన్) ను కనుగొన్నాయి ..
ఇది తీసుకుంటే మన లోపల రోగ నిరోధక శక్తి పెరిగి , ఒక వేళ కరోనా కు గురియై
నా
  కూడా అది మన మీద అతి ఎక్కువ ప్రభావం చూపకుండా ఉంటుంది.

 

ఇప్పుడు మనం ఆవిరి చికిత్స గురించి కూలంకషంగా తెలుసుకుందాం :

సనాతన భారతీయ ఆయుర్వేద పద్దతులలో మనకు జలుబు అయితే ఆవిరి పెట్టుకోవడం వింటూనే ఉంటున్నాం ...ఇది మన అందరికి తెలిసిన పద్ధతే ..సైనసైటిస్ కు కూడా ఆవిరి పెట్టుకోవడం మనకు తెలిసిందే.

ఇప్పుడు కరోనా కు కూడా ఆవిరి పెట్టుకుంటే వైరస్ యొక్క  ప్రభావం మన మీద తీవ్రంగా పడకుండా ఉంటుంది అని కొన్ని రకాల పరిశోధనలు చెప్తున్నాయి 

ఆవిరి ఎలా పనిచేస్తుంది ?

సహజంగా మామూలు జలుబు అయినప్పుడు ఆవిరి పెట్టుకోవడం వల్ల ముక్కు రంద్రాలు శుభ్రపడి  , గొంతులో నొప్పి పోయి శ్వాస  సాఫీగా తీసుకోవడానికి దోహదపడుతుంది ..అంటే ఆవిరి పెట్టుకోవడం వల్ల జలుబు వల్ల వచ్చే సమస్య పోతుంది ...

కరోనా వైరస్ కూడా మన శరీరం లోకి ముక్కు ద్వారా ప్రవేశించి అక్కడి నుండి గొంతు ద్వారా మరియు ఊపిరితిత్తుల లోకి ప్రవేశించి శ్వాస తీసుకోవడం  లో ఇబ్బంది కి గురిచేస్తుంది  ..

క్రొత్త కరోనావైరస్ దాని స్పైకీ ఉపరితల ప్రోటీన్లను ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసి , ముఖ్యంగా 
ఊపిరితిత్తు లను పాడుచేస్తాయి ..శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది కలుగుతుంది సకాలంలో చికిత్స అందకుంటే ఊపిరి ఆడక ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది ..

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కరోనా వైరస్  గొంతు నుండి ఊపిరితిత్తులోకి  ప్రవేశించే ముందే దాన్ని మనం అడ్డగించాలి ...

అందుకే ఆవిరి పెట్టడం వల్ల ఆ యొక్క వేడికి వైరస్ ప్రభావం తగ్గి మన శ్వాస వ్యవస్థ , కొంత వరకు ఊపిరితిత్తు లు చెడిపోకుండా కాపాడుతుంది ...

సరయిన మందులు వేసుకుంటూ ఇలా రోజు 2  లేదా 3  సార్లు ఆవిరి పట్టుకోవడం వల్ల గొప్ప ఉపశమనం ఉంటుంది అని పరిశోధనలు చెబుతున్నాయి .

ఆవిరి తయారు చేసే విధానం ఎలా ?

ఒక గిన్నె లో మంచి నీళ్లు పోసి , దాంట్లో గుప్పెడు పుదీనా ఆకులు , గుప్పెడు తులసి ఆకులు , నిమ్మ ఆకులూ , పసుపు 1 చెంచా , వాము  1 చెంచా , అల్లం ఆకులు , వెల్లుల్లి రెబ్బ , యూకలిఫ్టస్ ఆకులు 2  లేదా 3 .. అన్ని వేసి గిన్నె కి సరయిన మూతను పెట్టి 10 నిముషాలు మరిగించాలి .

కొందరు దీంట్లో విక్స్ , జండూబామ్ లాంటివి కూడా  ఘాటు కోసం వేస్తారు 

తరువాత ఒక శుభ్రమయిన బట్టను కప్పుకుని మూతని తీసి ఆవిరిని పీల్చాలి ..
ఆవిరిని ముక్కుతో , నోరుతో పీల్చాలి ... ఆ ఆవిరి మెల్లిగా గొంతు గుండా మీ ఊపిరితిత్తు లలోకి వెళ్తుంది ...  

ఒక వేళ కరోనా వైరస్ గొంతు లో కాని , ఊపిరితిత్తు లలో కానీ ఉంటె ఇలా ఆవిరితీసుకోవడం వల్ల శ్వాశ తీసుకోవడం లో అంతరాయాలు తొలగి పోతాయి ..

                                                               carona telugu

గుర్తుంచుకోవాల్సినవి :

ఆవిరిని అతి ఎక్కువ సేపు పెట్టుకోరాదు దీనివల్ల నోరు , గొంతు , ముక్కు, ఊపిరితిత్తు లు చెడి పోయే ప్రమాదం ఉంది ..మన యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆవిరిని పట్టాలి ,చిన్న పిల్లలలకు పెట్టరాదు 10 సంవత్సరాలు దాటిన వారికీ మాత్రమే పెద్దవాళ్లు పెట్టాలి ఆవిరి పెట్టుకొనే టప్పుడు ఊపిరి ఆడకుంటే పెట్టుకోరాదు ఆపేయాలి , తక్కువ సమయం పెట్టుకోవాలి .

ఆవిరి పెట్టుకునే ప్రతిసారి అన్ని మల్లి వేసుకుని పెట్టుకోవాలి  ...ఇంట్లో అందరు ఒకటే ఆవిరి పెట్టుకోరాదు దీనివల్ల ఒకరి వైరస్ ఇంకొకరికి సోకుతుంది.. 

ఆవిరి పెట్టుకోవడం అనేది పురాతన భారతీయ సంప్రదాయం ..దీన్ని మనం కరోనా వైరస్ కి ముందు నుండే వాడుతున్నాం ...
కరోనా సోకినా కానీ లేదంటే సోకినట్టు అనుమానం ఉంటె వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి .

 

 

మంచి ఆరోగ్యం కోసం వీటిని తప్పకుండ ఆచరరించండి 

0 Comments

Leave Your Comment

Submit

Book an Appointment :

Fill Out this Form for Instant Appointment.

Your information will never be shared with any thirdparty.

Order Your Personalized Diet Plan Now

Fill this form to get instant information about Diet Plans.

Your information will never be shared with any thirdparty.

20,000 +

Doctor's appointments completed

3000 +

Health Packages Delivered

2000 +

Second medical opinions

4000 +

Custom Diet Plans Delivered -Online

This website is an informational purpose only, contact a physician or specialist doctor for your health problem.