మీ తెల్ల జుట్టు నల్లగా అవ్వాలంటే ఇవి తప్పకుండ పాటించండి !!

మీ తెల్ల జుట్టు నల్లగా అవ్వాలంటే ఇవి తప్పకుండ పాటించండి !!

 

ప్రతి ఒక్కరు ఆరోగ్యముగా మరియు అందంగా ఉండాలని కోరుకుంటారు ,అందానికి & ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే మనిషి  ఆరోగ్యముగా  ఉంటేనే  అందంగా  ఉండగలుగుతారు.

అందాన్ని కాపాడుకోవటం లో తల వెంట్రుకలది గొప్ప పాత్ర , స్వతహాగా భారతీయులు నల్లని అందమయిన కురులను కలిగి ఉంటారు . కానీ  ఈ రోజులలో ప్రతి ఒక్కరు  ఏదో ఒక విధమయిన వెంట్రుకలకి సంబందించిన సమస్యను ఎదుర్కుంటున్నారు .

అందమయిన కురులకోసం శాస్త్రీయంగా రాసిన  ఈ  విలువయిన సమాచారాన్ని చదువుదాం

వెంట్రుకల సమస్యలు ఎన్ని రకాలు :

  • చిన్న వయసులో తల నెరవడం (తెల్ల వెంట్రుకలు)
  • తలలో చుండ్రు
  • తలలో పేను కొరుకుడు
  • వెంట్రుకలు ఊడిపోవడం
  • బట్ట తల

ముఖ్యముగా చాల మంది బాధ పడేది తెల్ల వెంట్రుకల గురించి ఎందుకంటే ఈ సమస్యవల్ల చిన్న వయసులో పెద్ద వయసు వాళ్ల లాగ కనపడటం . భారతీయులకు నల్లని వెంట్రుకలు ఉండటం అందానికి చిహ్నం.

తెల్ల వెంట్రుకల సమస్యను అధిగమించడం ఎలా !!

మనం ఈ సమస్యను చాల మట్టుకు సహజ పద్దతుల ద్వారానే  అధిగమించవచ్చు ,
 

ఈ సమస్యకు ఈ క్రింద కారణాలు కావొచ్చు -

  • వెంట్రుకల ఆరోగ్యానికి సరిపోయే ఆహారాన్ని తినకపోవడం
  • మానసిక ఒత్తిడి
  • ఆరోగ్య సమస్యలు
  • కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వెంట్రుకల మీద ప్రభావం చూపుతాయి
  • ఉదా : PCOD , క్యాన్సర్ చికిత్సకు సంబందించిన కీమోథెరపీ
  • థైరాయిడ్ సమస్యల వల్ల
  • కొన్ని రకాల మందుల ప్రభావం వల్ల
  • హార్మోన్ సమస్యల వల్ల
  • మెలనిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల
  • వంశపారం పర్యంగా

అయితే ఇప్పుడు ఈ తెల్ల వెంట్రుకల సమస్య ఎలా పోవాలో తెలుసుకుందాం :

విటమిన్స్ :

కొన్ని రకాల విటమిన్ల లోపం వల్ల  కూడా తెల్ల వెంట్రుకలు చిన్న వయసులో వస్తాయి అవి
విటమిన్ డి , విటమిన్ బి 6 , విటమిన్ బి 12 , విటమిన్ ఈ, బయోటిన్ ,విటమిన్ బి 9 (ఫోలిక్ ఆసిడ్ ) ,విటమిన్ బి 5 .

పోషకాలు ( nutrients ) :

ఈ క్రింది పోషకాల లోపం  వల్ల కూడా  ఈ సమస్య రావచ్చు  అవి క్యాల్షియమ్ , రాగి , ఇనుము ,కేరాటిన్ అనే ప్రోటీన్ మరియు జింక్ లోపం వల్ల కూడా .

తెల్లవెంట్రుకలు పోవడానికి /రాకుండా ఉండటానికి అద్భుతమయిన సూచనలు :

  • ధూమపానం మానేయండి
  • వెంట్రుకలకు  సహజసిద్దమయిన షాంపూ నే వాడండి
  • ప్రతి రోజు తల మీద నుండి స్నానం చేయకండి - వారానికి 2 లేదా 3  సార్లు చేయండి
  • బయటకి వెళ్ళినప్పుడు తలకు ఏదయినా కట్టుకోండి ఎందుకంటే కాలుష్యం , దుమ్ము ధూళి నుండి రక్షణ కోసం.
  • వెట్రుకలను శుభ్రపరచడానికి గోరువెచ్చని నీటినే వాడండి  -అతి చల్లని లేదా వేడి నీరు వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయి.
  • తలకు రాత్రి పడుకునే ముందు మంచి సహజ మయిన ఆయుర్వేద నూనె తో మర్దన చేయండి
  • చుండ్రు లేకుండా చూసుకోండి
  • వేడికి గురికాకండి
  • బయట జంక్ ఫుడ్ ని తినకండి
  • తగినంత నీటిని త్రాగండి
  • యోగ కానీ వ్యాయామం చేయండి - ఇది హార్మోన్స్ ని సమతుల్యముగా ఉంచుతుంది
  • పండ్ల  జ్యూస్ , క్యారట్ & బీట్ రూట్ జ్యూస్ ని తరచుగా తాగండి
  • కెమికల్ ఉన్న హెయిర్ డైస్ కానీ నూనెలను కానీ అసలే వాడకండి
  • ప్రతి రోజు తప్పకుండ 15 నిముషాలు ధ్యానం చేయండి ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది .
  • మంచి పోషకాలతో కూడుకున్న ఆహారాన్ని తినండి
  • మీకు సరిపడా కూరగాయలు మరియు ఆకుకూరలు ప్రతి రోజు తినండి
  • గ్రీన్ టీ ని త్రాగండి దీంట్లో యాంటీఆక్సిడాంట్స్ ఉంటాయి
  • ప్రతి రోజు  5  బాదాం పలుకులు తినండి - విటమిన్ ఈ -కోసం
  • ప్రతి దినం ఒక కప్పు మొలకెత్తిన విత్తనాలు తినండి
  • అన్ని రకాల పండ్లను తినాలి
  • ప్రతి వ్యక్తికి రోజుకు 1.3 మిల్లి గ్రా // విటమిన్ బి 6 అవసరం , ఇది తృణధాన్యాలలో , ఆకుకూరలలో, సొయా లో ఉంటుంది .
  • పాలు మరియు జున్నులో విటమిన్ బి 12 ఉంటుంది ఇది వెంట్రుకల ఆరోగ్యానికి చాల అవసరం.
  • ప్రొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు -వీటిలో  విటమిన్ ఈ , మరియు జింక్ ఉంటుంది .
  • ఉసిరికాయలను ఆహారం లో వాడండి -ఇవి విటమిన్ సి, మరియు యాంటీఆక్సిడాంట్స్ కలిగిఉంటాయి .
  • బెర్రీ పండ్లు మరియు బత్తాయి
  • అరటి పండ్లు తినండి వీటిలో మెగ్నీషియం మరియు జింక్ ఉంటాయి
  • కరివేపాకు ను వంటలలో వాడండి లేదంటే రోజుకు 2 చెంచాల కరివేపాకు పొడిని అన్నం లో కలువుకుని కానీ ఇడ్లి లతో పాటుగా తినండి.
  • వీలయితే కుంకుడు కాయలను వెంట్రుకలు శుభ్రపరుచుకోవడానికి వాడండి
  • పరిశుభ్రమయిన నీటిని తగినంత త్రాగండి
  • వారానికి 2 సార్లు కలబంద గుజ్జును వెంట్రుకలకు మర్దన చేసి 15 నిమి// తర్వాత సహజమయిన షాంపూ తో తలస్నానం చేయండి.ఇది మీ తల వెంట్రుకలకు మంచి నిగారింపు ఇస్తుంది & సహజమయిన కండీషనర్ గా పనిచేస్తుంది

ఇతర ముఖ్యమయిన సూచనలు :

  • ధూమపానం మానేయండి
  • వెంట్రుకలకు  సహజసిద్దమయిన షాంపూ నే వాడండి
  • ప్రతి రోజు తల మీద నుండి స్నానం చేయకండి - వారానికి 2 లేదా 3  సార్లు చేయండి
  • బయటకి వెళ్ళినప్పుడు తలకు ఏదయినా కట్టుకోండి ఎందుకంటే కాలుష్యం , దుమ్ము ధూళి నుండి రక్షణ కోసం.
  • వెట్రుకలను శుభ్రపరచడానికి గోరువెచ్చని నీటినే వాడండి  -అతి చల్లని లేదా వేడి నీరు వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయి.
  • తలకు రాత్రి పడుకునే ముందు మంచి సహజ మయిన ఆయుర్వేద నూనె తో మర్దన చేయండి

ఉదా : మందార నూనె , బృంగరాజ నూనె , కొబ్బరి నూనె , ఇంకా నిపుణులు సూచించబడిన నూనెలు .

  • చుండ్రు లేకుండా చూసుకోండి
  • వేడికి గురికాకండి
  • బయట జంక్ ఫుడ్ ని తినకండి
  • తగినంత నీటిని త్రాగండి
  • యోగ కానీ వ్యాయామం చేయండి - ఇది హార్మోన్స్ ని సమతుల్యముగా ఉంచుతుంది
  • పండ్ల  జ్యూస్ , క్యారట్ & బీట్ రూట్ జ్యూస్ ని తరచుగా తాగండి
  • కెమికల్ ఉన్న హెయిర్ డైస్ కానీ నూనెలను కానీ అసలే వాడకండి
  • ప్రతి రోజు తప్పకుండ 15 నిముషాలు ధ్యానం చేయండి ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది .

ఇలా మీరు కొన్ని వారాలు క్రమం తప్పకుండ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి .

ఎల్లప్పుడూ ఆరోగ్యముగా మరియు అందముగా ఉండండి 

0 Comments

Leave Your Comment

Submit

Book an Appointment :

Fill Out this Form for Instant Appointment.

Your information will never be shared with any thirdparty.

Order Your Personalized Diet Plan Now

Fill this form to get instant information about Diet Plans.

Your information will never be shared with any thirdparty.

20,000 +

Doctor's appointments completed

3000 +

Health Packages Delivered

2000 +

Second medical opinions

4000 +

Custom Diet Plans Delivered -Online

This website is an informational purpose only, contact a physician or specialist doctor for your health problem.