Image

 

ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించడానికి ప్రయత్నిస్తారు, అయినప్పటికీ దానిని ఆచరణలో ఉంచే విషయంలో మనమందరం ఏదో ఒక సమయంలో విఫలమవుతాము.

మనం ఆరోగ్యంగా  ఉంటె అన్ని సాధించినట్టే అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ..

ఈ రోజుల్లో ప్రతి కుంటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం తో బాధపడుతున్నారు 

ఈ రోజు, మీ లక్ష్యాలను చేరుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపించే ఆరోగ్యకరమైన అలవాట్లను మీకు  నేర్పించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము!

మీ జీవితాన్ని మరింత ఉత్పాదకంగా మెరుగుపరచడానికి ఈ పరిపూర్ణమైన  జీవనశైలిని అలవాటు చేసుకోండి.

ఈ  5 అలవాట్లను తప్పకుండ పాటించండి :

1. మీ శరీరాన్ని కదిలించండి:

మీ శరీరం కదలికలను ఇష్టపడుతుంది , ఈ కదలికలు  మీ శరీరం బరువును నియంత్రణలో ఉంచడానికి  , కండరాలు మరియు ఎముకలను బలోపేతం చేయడానికి తగినంత శారీరక శ్రమ అవసరం.
దీన్ని మనం ఈ రోజుల్లో వ్యాయామం ద్వారా పొందుతున్నాం .లేదంటే సహజంగా మనం చేసుకునే పనుల వల్ల పొందుతుంటాము 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి ప్రపంచంలోని 60 నుండి 85% మంది ప్రజలు నిశ్చల జీవనశైలిని గడుపుతున్నారు.
అంటే ఒక మాటలో చె
ప్పా లంటే శరీరానికి తగిన శారీరక శ్రమను ఇవ్వకుండా  ఉండటం .

దీని వల్ల తక్కువ వయస్సులో కూడా , హృదయ సంబంధిత వ్యాధులు , సడన్ కార్డియాక్ అరెస్ట్ , మధుమేహం , అధిక బరువు , చర్మ వ్యాధులు , క్యాన్సర్  , మహిళలో రొమ్ము క్యాన్సర్ , థైరోయిడ్ , వంటి ఎన్నో సమస్యలు ఎదురు కావొచ్చు .


2. ఆరోగ్యకరమైన ఆహారం:

మీ ఆహారపు అలవాటు మీ ఆరోగ్యానికి నేరుగా  సంబంధం ఉంటుంది. కాబట్టి, ప్రతి ఋతువులో దొరికే ఆహారం తినడం , శుభ్రమయిన ఆహారాన్ని తినడం, ఎక్కువగా నూనెలు వేపుడు లేని ఆహారాన్ని వండుకోవడం , అన్ని రకాల పళ్ళు తినడం మంచి ఆహారపు అలవాటు అవుతుంది ..

జంక్ ఫుడ్ తినడం , బయట దొరికే ఆహారం మీద ఆధారపడటం తిగ్గించుకోవడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను  అయినా  సరైన ఆహార నిర్వహణతో తగ్గించుకోవచ్చు .

ఆరోగ్యకరమైన ఆహారం అన్ని రకాల పోషకాహార లోపం నుండి రక్షించడానికి సహాయపడుతుంది

3. మానసిక శ్రేయస్సును ప్రోత్సహించండి:

మీ శారీరక శ్రేయస్సు ఎంత ముఖ్యమో మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీతో సమయం గడపండి మరియు మీ అంతరంగాన్ని అర్థం చేసుకోండి!
మానసిక ప్రశాంతత కోసం ధ్యానం సాధన చేయండి.

meditation in telugu

4. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి :

చదవడం మీ ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మంచి కోసం మిమ్మల్ని ప్రేరేపించే ఉత్తమ పుస్తకాలను చదవండి. పడుకునే ముందు చదవడం వల్ల మీకు అంతరాయం లేని  నిద్ర పడుతుంది .

ఎక్కువగా నేర్చుకునే ప్రయత్నం చేయండి ..దీన్ని వల్ల జ్ఞానం మరియు ప్రశాంతత వస్తుంది ..మీ యొక్క విజయం మీరు నేర్చుకోవడం మీద నే ఆధారపడుతుంది .

5. మీ ఒత్తిడిని నియంత్రించుకోండి:

ఈ ఆధునిక ప్రపంచం లో మనం అనుభవిస్తున్నది ఒత్తిడి .... అన్ని ఉన్నా  కూడా ఏదో ఒక  మానసిక ఆందోళన ఇప్పుడు పట్టి పీడిస్తున్న సమస్య ...
ఎక్కువగా డబ్బులు సంపాందించాలనే ఆరాటం , ఉన్నత చదువులు చదవాలనే ఆకాంక్ష , కుటుంబ సౌఖ్యం లేకపోవడం , ఇంకా ఎన్నో కారణాలు ఈ ఒత్తిడి 
 కి  మూలం ...

మీ ఒత్తిడిని నియంత్రించడానికి ప్రయత్నించండి. ఒత్తిడి లేని జీవన మార్గాన్ని అవలంబించుకోవడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండచ్చు...
 మీకు నచ్చిన పనిని చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది , ఆటలు , మంచి అలవాట్లు , నడక , దూరపు ప్రదేశాలు చూడటం , ప్రియమయిన మిత్రులతో మాట్లాడటం , మంచి కుటుంబ సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఒత్తిడి ని అధిగమించవచ్చు ...

మనం చదివిన ఈ 5 అద్భుతమయిన అలవాట్లను ఒక 40 రోజులు ఆచరించి చూడండి అద్భుతమయిన ఫలితాలను మీరే చూస్తారు ...

Add new comment

CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions. Image CAPTCHA
Enter the characters shown in the image.

Home