Image

ఆయుర్వేదం అతి ప్రాచీన చికిత్సా పద్ధతి ,ఆయుర్వేదం ఎన్నో వ్యాధులను రానీయకుండా కాపాడుతుంది

దినచర్య మరియు ఋతుచర్య

ఆయుష్ మినిస్ట్రీ ప్రకారం

ప్రతి దినం లో చేసేవి :

1 దినం లో తరచుగా గోరు వెచ్చని నీటిని తాగాలి .
2 ప్రతి రోజు 30 నిముషాలు యోగ / ప్రాణాయామం చేయండి
3  వంటలలో ప్రతి రోజు వీటిని వాడండి : పసుపు , ధనియాలు (ధనియాల పొడి ),వెల్లి మరియు జిలకర .

ఆయుర్వేద ప్రకారం రోగ నిరోధకశక్తి ని ఇలా పెంచుకోండి :


1 - చవనప్రాశ్ 1  చిన్న చెంచా (10 గ్రాములు) ప్రొదున , మధుమేహం ఉన్నవారు చక్కర లేని చవనప్రాశ్ ను వాడాలి .

2 - హెర్బల్ టీ / డికాక్షన్ (కాడ) వీటితో చేసుకోండి  :తులసి , దాల్చిని , నల్ల మిరియాలు ,శొంఠి ,ఎండిన ద్రాక్ష మరియు  బెల్లాన్ని చేర్చి టీ ని తయారు చేసుకొని రోజుకు 2  సార్లు త్రాగండి , రుచి కోసం నిమ్మ రసాన్ని కలువుకోండి

3 గోల్డెన్ మిల్క్ / బంగారు పాలు : వేడి పాలలో 1 చెంచా పసుపు కలుపుకుని  1 లేదా 2 సార్లు   తాగండి


ఇంకా కొన్ని పాటించాల్సినవి

నాసల్ థెరపీ ( ప్రతిమార్ష నస్య ) : నువ్వుల నూనె కానీ , కొబ్బరి నూనె కానీ లేదా నెయ్యి ని ముక్కు రంద్రాలలో ఒక్క చుక్క ప్రొద్దున మరియు సాయంత్రము వేసుకోండి .

ఇది నిపుణుల వద్ద చేయడం ఉత్తమ్ .

ఆయిల్ పుల్లింగ్ థెరపీ :ఒక చెంచా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను నోట్లో 2  లేదా 3 నిముషాలు  పుక్కిలించి ఉమిసేయాలి తరువాత గోరు వెచ్చని నీటిని పుక్కిలించి ఉమిసేయాలి  ఇలా రోజుకు 1 లేదా 2 సార్లు చేయాలి .

 

పొడి దగ్గు , గొంతు నొప్పి ఉన్నపుడు :


1 పుదీనా లేదా ఓమ (వాము ) ను వేడి నీటిలో మరిగించి ఆ ఆవిరిని నెమ్మదిగా పీల్చుకోవాలి ,ఇలా రోజుకు ఒక్కసారి చేయాలి .

2 లవంగం పొడి ని కొద్ది చక్కర / తేనే లో కలిపి తినాలి ఇలా 2 లేదా 3 సార్లు  తీసుకోండి .

ఈ పద్ధతులు అన్ని రోజు  తరచుగా వచ్చే దగ్గు కు సంబందించినవి , మీ యొక్క డాక్టర్ ను సంప్రదించండి అత్యుత్తమ చికిత్స కోసం .

గమనిక : దయచేసి పై వివరాలు , పద్ధతులు , సహజ ఇంటి చికిత్స లు కరోనా వైరస్ , కోవిద్ 19 చికిత్స కోసం కాదు , మన ఇమ్మ్యూనిటి / రోగ నిరోధకశక్తిని పెంచడానికి సూచించ బడ్డాయి .

source: 
https://www.mohfw.gov.in/pdf/ImmunityBoostingAYUSHAdvisory.pdf

Add new comment

CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions. Image CAPTCHA
Enter the characters shown in the image.

Home