Image

 

బ్లడ్ ప్రెషర్ ని తెలుగులో రక్తపోటు అంటాము , ప్రపంచం మొత్తం మీద ఈ రక్తపోటు కు సంబందించిన వ్యాధులతో  7.5 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి ,ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూ పోతోంది ..

రక్తపోటు అనేది అధిక రక్తపోటు లేదా అల్ప రక్తపోటు అయిఉంటుంది , ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో ఇది సహజమయిన  స్థితిలో ఉంటుంది .
ఇప్పుడు రక్తపోటు అంటే ఏమిటో తెలుసుకుందాం ..

గుండె కు రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలు అధిక ఒత్తిడికి గురిఅవుతూ రక్తాన్ని గుండెకు చేరవేయడాన్ని  అధిక రక్తపోటు అంటాము ఈ రక్తనాళాలు రక్తాన్ని తగిన మొత్తం లో  గుండెకు చేరవేయడానికి చాల కష్టపడుతూ ఉంటాయి . కొన్ని రకాల కారణాల వల్ల ఇవి కుంచించుకు పోయి గుండెకు చేరాల్సిన రక్తాన్ని అడ్డుకుంటాయి దీని వలన గుండె నొప్పి ఇంకా ఇతర సమస్యలు ఉత్పన్నం అవుతాయి .


అధిక రక్తపోటు ఈ రోజులలో 25 సం // వయసు వారికీ కూడా వస్తున్నది దీనికి చాల కారణాలు ఉన్నాయి , ఈ అధిక రక్తపోటు వల్ల గుండెపోటు ,గుండెకు సంబందించిన అనారోగ్యాలు , మూత్రపిండాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది .

అధిక రక్తపోటు  లక్షణాలు ముందుగా పసిగట్టడం వల్ల చాల ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు .

అధిక రక్తపోటు  లక్షణాలు :

  • తలనొప్పి
  • అలసట  / గాబరా
  • కనపడటం లో తేడా / మసకగా కనిపించడం
  • ఛాతిలో నొప్పి / ఛాతి లో బరువుగా అనిపించడం
  • శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది
  • గుండె కొట్టుకునే వేగం లో మార్పు
  • మూత్రం లో రక్తం పోవడం
  • ముక్కు నుండి రక్తం కారడం
  • మైకం

ఇంకా కొన్ని సార్లు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే  అధిక రక్తపోటు కు గురి అయ్యే అవకాశం ఉంది ,

వైద్యులు  రక్తపోటు కొలవడానికి రెండు సంఖ్యల పరిమాణాలు/కొలతలు  చూస్తారు

1 --సిస్టోలిక్ పీడనం
2 -- డయాస్టోలిక్ పీడనం

ఈ కొలతలు 120 నుండి 139  mm Hg  ( సిస్టోలిక్ పీడనం) / 80 నుండి 89 mm Hg (డయాస్టోలిక్ పీడనం)   వరకు ఉంటె  అధిక రక్తపోటు కు దగ్గరగా ఉన్నట్టు .

ఈ కొలతలు140 / 90 mm Hg  కి సమానంగా లేదా ఎక్కువగా ఉంటె అధిక రక్తపోటు గ వైద్యులు భావిస్తారు ,

ఈ కొలతలు కచ్చితంగా తెలుసుకోవడాని మీ కుటుంబ వైద్యున్ని లేదా కార్డియాలజిస్ట్ ను సంప్రదించండి

అధిక రక్తపోటు ఉంది అని   రక్తపోటు ను కొలిచే సాధనంతో కొలుస్తారు ,  దీంట్లో  రీడింగ్
120 / 80 కంటే ఎక్కువగా పలు మార్లు (వివిధ సమయాలలో తరచుగా )వచ్చినప్పుడు అధిక రక్తపోటు గా భావిస్తారు ,

అధిక రక్తపోటు రావడానికి గల కారణాలు :

  • జీన్స్
  • వారసత్వంగా
  • పొగ త్రాగడం
  • నిశ్చల జీవనశైలి
  • అధిక బరువు
  • ఉప్పును అధికంగా తినడం
  • ఇతర ఆరోగ్య సమస్యల వల్ల
  • శారీరక శ్రమ లేకపోవడం
  • ఎక్కువ సమయం కూర్చుని పని చేయడం
  • వయస్సు
  • మానసిక ఒత్తిడి
  • చెడు క్రొవ్వులు - బ్యాడ్ కొలెస్టరాల్

ఈ పై కారణాల వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది ,

అధిక రక్తపోటు వల్ల కలిగే సమస్యలు :

  • గుండె పోటు మరియు గుండె కు సంబందించిన సమస్యలు
  • మెదడులో రక్తం గడ్డ కట్టడం
  • పక్షవాతం
  • మధుమేహం
  • మూత్రపిండాల సమస్యలు

అధిక రక్తపోటు ను అదుపులో పెట్టడం ఎలా :

మన యొక్క అలవాట్లను మార్చుకుని దీన్ని అదుపులో పెట్టవచ్చు :

  • పొగత్రాగే అలవాటు ఉంటె మొత్తానికే మానెయ్యాలి
  • ప్రతి రోజు తగినంత పరిశుభ్రమయిన నీటిని త్రాగాలి

(మన శరీరానికి తగినంత నీటిని త్రాగడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది)

  • శరీర బరువు అధికంగా ఉంటె తగ్గించుకోండి
  • శారీరిక బరువు ఎక్కువ అవుతే రక్తపోటు ఎక్కువగా అవుతుంది
  • మంచి ఆహారాన్ని తినాలి
  • ఆకుకూరలు , కాయగూరలు ,క్యారెట్స్ ,బీట్రూట్ , తోటకూర , సొరకాయ , టమాటా ..


అవిసె గింజలు
వీటిలో ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి .

విటమిన్ సి , ఐరన్ మరియు మేగ్నెసియం :

ఇవి ఉన్న ఆహారపదార్తాలు తినడం వల్ల కూడా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది ,

ఇవి తృణధాన్యాలలో , ఆకుకూరలలో, సెనగలు , నిమ్మ జాతి పండ్లు ,అరటిపండ్లు మరియు మొలకెత్తిన విత్తనాలు.

ప్రతి రోజు తప్పకుండ 40 నిముషాలు నడవాలి లేదా ఏదయినా శారీరక వ్యాయామం చేయాలి

ప్రతి దినం 15 నిముషాలు  అయినా ధ్యానం చేయాలి - శ్వాసకు సంబందించినవి .


ఇలా చేస్తే  అధిక రక్తపోటు  సమస్యను అధిగమించవచ్చు

అధిక రక్తపోటు ఉంటె మీ వైద్యుని సలహా ప్రకారం మందులు వేసుకోండి , తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి , అధిక రక్తపోటు  ను అదుపు చేసే ఆహారాన్నే తినండి .

 

Add new comment

CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions. Image CAPTCHA
Enter the characters shown in the image.

Home