benefits of keera

 

కీర దోసకాయ అనే పదం వినగానే ముందుగా మనలో కలిగే అనుభూతి కూల్ కూల్ చల్లనిది ఎందుకంటె దోసకాయ తిన్న వెంటనే మనకు అలాంటి అనుభూతి కలుగుతుంది . ప్రపంచ వ్యాప్తంగా దీనిని దాదాపు అన్ని దేశాల ప్రజలు ఆహారంగా తీసుకుంటారు .

ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న కీర దోసకాయ సుమారు 3000 సంవత్సరాల క్రితం నాటిది దీనిని  భారతదేశంలో మొట్టమొదట గా పండించారు తర్వాత గ్రీస్ మరియు ఇటలీ ద్వారా యూరప్ కు వ్యాపించింది నిజానికి సంప్రదాయ భారతీయ ఔషధం పురాతన కాలం నుంచి కీరదోసకాయను ఉపయోగిస్తుంది.

దీన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పండిస్తున్నారు చైనా దోస కాయను ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది  మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 77% శాతం పండిస్తోంది.   వీటిని పచ్చిగా అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడే కోసి తిన్నడం వల్ల సరయిన పోషకాలు మనకు అందుతాయి  .దోసకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం  keera dosa benefits in telugu


 

కీర దోసకాయల గురించిన కొన్ని ఆసక్తికరమయిన వాస్తవాలు : 

1.శాస్త్రీయ నామం: కుకుమిస్ సాటైవస్ (Cucumis sativus)
2.కుటుంబం: కుకుర్బిటసే
3.సాధారణ పేరు: కీరదోసకాయ, ఖీరా
4.సంస్కృతం పేరు: ఉర్వరుక
5.ఉపయోగించే భాగాలు: కీరదోసకాయ యొక్క కండ (ఫ్లెష్), విత్తనాలు మరియు తొక్క అన్నింటినీ  (ముడిగానే) పచ్చిగానే తినొచ్చు. 
6.స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: కీరదోసలు పురాతన భారతదేశం నుండి ప్రపంచానికి పరిచయమయ్యాయి. మొదట ఇవి అడవుల్లోనే పండేవి.
7.ఆసక్తికరమైన విషయాలు: జపాన్లోని బౌద్ధ దేవాలయపు పూజారులు సురక్షితమైన వేసవి కొరకు ప్రార్థన చేస్తూ, కీరదోసకాయతో దీవెనలందించే సంప్రదాయాన్ని పాటిస్తారు. రోమన్ చక్రవర్తి టిబెరియస్ ఏడాది పొడవునా తన టేబుల్పై ఒక కీరదోసకాయను ఉంచాలని పట్టుబట్టేవారట. 

వీటిని కూడా తప్పకుండ చదవండి : అతిముఖ్యమయిన ఆరోగ్య సూత్రాలు 

కీర దోసకాయ లో అనేక పోషక విలువలు ఉన్నాయి .శరీరానికి చల్లదనాన్ని అందించే కీరదోస ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే దోసకాయ ఆకలి దాహం వేయకుండా ఉంటాయన్న కారణంతో ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటాం. అందుకే బౌద్ధ భిక్షువులు వేసవిలో చల్లగా ఉండాలని కోరుకుంటూ కీరాతో దీవిస్తారట. 95% శాతం నీటితో ఉండే దోసకాయ వల్ల వడదెబ్బ తగలదు అందువల్ల ఇది వేసవి తాపం తీర్చే మంచినీటి భండాగారం.

100 g లకు విలువ
నీటి పరిమాణం 95.23 గ్రా , శక్తి 16 కిలో కేలరీలు ,ప్రోటీన్ 0.65 గ్రా ,కొవ్వు (ఫ్యాట్) 0.11 గ్రా  కార్బోహైడ్రేట్ 11.05 గ్రా , ఫైబర్ 3.63 గ్రా ,మినరల్స్ , కాల్షియం 16 mg , ఐరన్0.28 mg ,ఇంకా ఎన్నో విటమిన్లు మరియు సూక్ష్మ ఫోషకాలు ఉన్నాయి 

 

దోసకాయలు వల్ల కలిగే 18 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు (keera dosa benefits in telugu):

1.దోసకాయ వల్ల జీర్ణశక్తి బాగుంటుందని పోట్టలోని టాక్సిన్లను బయటకు పంపించేస్తుందనీ పోషక నిపుణులూ చెబుతున్నారు. 
2.కీరాల లను ఎక్కువగా సలాడ్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు 
3.కీరదోస వల్ల పొట్టలో చెడు పేరుకుపోకుండా చూసే పీచుపదార్థం  ఉంటుంది 
4.రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్ సి , ఎముకల వృద్ధికీ తోడ్పడే విటమిన్ కె,ఇంకా  ఎన్నో సూక్ష్మ పోషకాలు ఉంటాయి .
5.దీనిలో సంమృద్ధిగా ఉండే పొటాషియం, మెగ్నీషియం వల్ల అధిరక్తపోటు అదుపులో ఉంటుంది మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది .
6.వేసవిలో కీర ముక్కలు,పుదీనా కలిపి మిక్సీలో వేసి   జ్యూస్ లా చేసుకొని తాగితే డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. 

7.దోస లోని పోషకాలు మూత్రపిండాల్లోని రాళ్లనీ తొలగిస్తాయి. కీరా రకాల్లో పుష్కలంగా ఉండే కాల్షియం, విటమిన్ కె లు శరీరంలోకి త్వరగా ఇంకడం వల్ల ఎముక సమస్యలు రావట. 

8.వీటిల్లోని సిలికా మృదులాస్థి కణజాలం ను పెంచడం ద్వారా కీళ్ల నొప్పుల్ని రానివ్వదు. కాళ్లు కీళ్లలోకి నీరు చేరడం వల్ల వచ్చే సమస్యలకు  కీరాలోని కెఫిక్ఆమ్లం మందులా పనిచేస్తుంది.

9.కీర దోస తొక్కల్లోను విత్తనాల్లోను బీటాకెరోటిన్ శాతం ఎక్కువ అందుకే కంటి సమస్యలు ఉన్న వాళ్ళు వీటిని తింటే ఫలితం కనిపిస్తుంది. 

10.దోస క్యాన్సర్లను నియంత్రిస్తుంది. వీటిల్లోని లారిసెరిసినాల్, పినోరేసినాల్, సెకోయుసోరిసినాల్, అనే లిగ్నన్లు అండాశయ గర్భాశయ ప్రోస్టేట్ క్యాన్సర్లను తగ్గిస్తాయి. 

11.అలాగే వీటిల్లోని గ్లైకోసైడ్లూ ప్లేవనాఇడ్లూ శరీరంలోని ఇన్సులిన్ ను క్రమబద్దీకరించడం తోపాటు జీవక్రియను ప్రభావితం చేయడం ద్వారా మధుమేహాన్ని అడ్డుకుంటాయి. ముఖ్యంగా పురుషుల్లో గ్లూకోజ్ స్థాయిల్ని తగ్గించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

12.సోడియం తక్కువగానూ పొటాషియం,మెగ్నీషియంలు ఎక్కువగా ఉండే దోస రకాలు బీపీ,హృద్రోగాల్నీ రానివ్వని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంటోంది.

13.ఈ రోజులలో చాలామంది ఎదుర్కునే సమస్యలలో చేడు క్రొవ్వు శరీరం లో పేరుకు పోవడం ఒకటి దీని వల్ల రక్తనాళాలు పూడుకుపోయి గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది

14.రక్త పోటును అదుపులో ఉంచడానికి   కీరా అద్భుతంగా పనిచేస్తుంది.  60 ఏళ్లు పైబడిన వాళ్ళకి ఈ కీరా రసాన్ని ఇచ్చినప్పుడు రక్తపోటు అదుపులో ఉండటాన్ని గమనించారు.

15.వీటిల్లోని ఫిస్టిన్ అనే ఫ్లేవనాయిడ్స్ మెదడు పనితీరును ప్రభావితం చేయడం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుతుంది . కీరా చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.వీటిల్లోని రుటీన్, ఆస్కార్బిక్,ఆక్సిడేజ్ అనే పదార్థాలు ఫ్రీరాడికల్స్ ను అడ్డుకుంటాయట. 

16.వీటికి సహజంగానే కాంతిని అందుకునే గుణం ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే సన్ స్క్రీన్,ఐటోనర్లూ లోషన్స్ క్రీముల్లో నూ వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇది మనకు ఒక సహజమయిన సన్ స్క్రీన్ ల ఉపయోగపడుతుంది.

17.దోస ని గుజ్జులా చేసి టోనర్ లా ఫేస్ మాస్క్ లా కూడా  వాడుకోవడం వల్ల మచ్చలు తగ్గుతాయి.

18.బరువు తగ్గాలనుకునే వాళ్లకి కీరా మంచి ఆహారం.అందులోని నీటితో పోట్ట నిండిపోయి, ఆకలి అనిపించదు.
అయితే వీటిని ఎక్కువగా తింటే అతిమూత్ర వ్యాధి,కడుపుబ్బరం వంటివి వచ్చే అవకాశం ఉంది.కాబట్టి తగు మోతాదులో వీటిని తీసుకోవాలి.

 

మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి -బుక్ చేసుకోండి అతి తక్కువ ధరలలో మీ పట్టణం లో హెల్త్ చెకప్స్ 

 

దోసకాయ తింటే మధుమేహం కంట్రోల్ అవుతుందా ?

 మెడిసిన్‌తో పాటు, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడే ఆహారాలతో నిండిన ఆహారం తీసుకోవడం ఈ డయాబెటీస్‌ని ఎదుర్కోవటానికి సాయపడుతుంది. మధుమేహం ఉన్నవాళ్లు   దోసకాయని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

డయాబెటిస్ డైట్‌ లో ముఖ్యమైన ఆహారాలలో కీరదోసకాయ ఒకటి. దోసకాయలో ఎక్కువగా నీరు, తక్కువ శాతం కేలరీలు ఉంటాయి. అదేవిధంగా ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కీరదోస కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను, చక్కెరను తగ్గిస్తుంది. ఈ కారణంగా రక్తంలో చక్కెర ద్వారా వచ్చే సమస్యలను నివారిస్తుంది.

వీటిల్లోని లారిసెరిసినాల్, పినోరేసినాల్, సెకోయుసోరిసినాల్, అనే లిగ్నన్లు అండాశయ గర్భాశయ ప్రోస్టేట్ క్యాన్సర్లను తగ్గిస్తాయి. అలాగే వీటిల్లోని గ్లైకోసైడ్లూ ప్లేవనాఇడ్లూ శరీరంలోని ఇన్సులిన్ ను క్రమబద్దీకరించడం తోపాటు జీవక్రియను ప్రభావితం చేయడం ద్వారా మధుమేహాన్ని అడ్డుకుంటాయి. ముఖ్యంగా పురుషుల్లో గ్లూకోజ్ స్థాయిల్ని తగ్గించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.వ్యాధులకు కారణమైన ఇన్ ప్లమేషన్ నీ ఇవి తగ్గిస్తాయట.

అన్నింటికంటే ముఖ్యమైంది ఏమిటంటే కీరదోసలో పిండి పదార్ధాలు తక్కువగా ఉంటాయి, అందుకే ఇది డయాబెటిస్ డైట్ ‌లో భాగం కావడానికి ప్రధాన కారణం. దోసకాయ చల్లని, రిఫ్రెష్ రుచిని అందిస్తుంది. అందుకే దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు

దోసను ఎన్ని రకాలుగా తినొచ్చు ?

దీనిని పచ్చి ముక్కలుగా కూడా తినొచ్చు ఇంకా దీనితో కూర , పప్పు , సాంబార్ , పెరుగు పచ్చడి , శాండ్విచ్ లలో ,ఊరగాయగా పెట్టుకుని కూడా కీరదోసల్ని తినొచ్చు. మరియు ఎన్నో విధాలుగా తినొచ్చు .

ఇప్పుడు మనం అందరికి నచ్చే ఒక ఆరోగ్యకరమయిన  వంటకాన్ని చూద్దాం 

కీరదోస రైతా తయారీ విధానం ..

చాలా మంది పెరుగును ఇష్టంగా తీసుకుంటారు. కొందరు లస్సి, మజ్జిగ, లేదా అన్నంలో కలుపుకొని , రైతా ఇలా అనేక రకాలుగా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రైతా అనేది భారతీయ భోజనాన్ని సంపూర్ణం చేస్తుంది.

బిర్యాని, ఫ్రైడ్ రైస్ ఇలా రుచికరంగా వండినప్పుడు రైతా తప్పక ఉండాలి. రైతా‌ని చాలా మంది బూంది, ఆలూని వేసి చేస్తారు. అయితే, అలాంటి వాటికి  బదులుగా కీరదోసని వేయండి. ఇది రైతాకు మరింత రుచిని ఇస్తుంది. దోసకాయ రైతా లో కొద్దిగా కీరదోస ముక్కలు వేసి ఉప్పు, జీలకర్ర పొడి, నల్ల మిరియాలు వంటి మసాలా దినుసులు చేర్చండి. ఈ రైతా రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అలానే పెరుగు, కీరదోస శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి సహాయపడతాయి.

ఇక్కడ నుండి :మీ  ఆరోగ్యం కోసం ఒక నిష్ణాతుడయిన వైద్యుని సలహా తీసుకోండి 

కీరా దోస వల్ల ఇన్ని రకాలుగా తెలుసుకున్న తరువాత తినకుండాఉండగలమా ..
మీకు ఈ సమాచారం నచినట్లయితే , అందరికి షేర్ చేయండి ..

ఆరోగ్యంగా ఉండండి - ఆనందంగా ఉండండి 

 

Add new comment

CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions. Image CAPTCHA
Enter the characters shown in the image.

Home