పెద్ద వారిలో తరచుగా మూత్ర విసర్జన ఎందుకు వస్తుంది తెలుసుకోండి

పెద్ద వారిలో తరచుగా మూత్ర విసర్జన ఎందుకు వస్తుంది తెలుసుకోండి

మీరు మామూలుగా  కన్నా ఎక్కువ సార్లు  మూత్రం విసర్జన చేయాలనిపించినప్పుడు, ఆ పరిస్థితిని ‘తరచూ మూత్రవిసర్జన’ గా చెప్పవచ్చు. తక్షణమే మూత్రవిసర్జన చేయాలనిపించే  ఈ కోరిక బలంగానూ, ఆకస్మికముగానూ ఉండి మాటిమాటికీ మూత్రాశయంలో అసౌకర్యాన్ని కలిగించవచ్చు.

అంతే కాకుండా కొందరు పెద్దలలో, రాత్రి సమయంలో  తరచూ మూత్రవిసర్జన  చేయాలనే  కోరిక ఉంటుంది  ఈ పరిస్థితిని నాక్టూరియా గా పిలువబడుతుంది. సాధారణముగా, మీరు  మూత్రవిసర్జన అవసరం లేకుండా 6 నుండి 8 గంటలపాటు నిద్రపోవచ్చు.

తరచూ మూత్రవిసర్జన అవుటకు గల కారణాలు
 

తరచూ మూత్రవిసర్జన అవుటకు గల కారణాలు:

•  వృద్ధులు మరియు  మధ్య వయస్కులలో ప్రోస్టేట్ గ్రంధి వాపు వలన.

• మూత్ర మార్గములో  అంటువ్యాధి  - UTI.

• వజీనైటీస్  లేదా యోనిశోథ.
• మూత్ర ద్వారము యొక్క ఇన్ఫెక్షన్ మరియు వాపు

.• మూత్ర ద్వారము  నుండి మూత్రము లీకేజ్.


తరచూ మూత్రవిసర్జన అవుటకు  ఇతర కారణాలు:

మూత్రాశయ క్యాన్సర్

•  ఆందోళన
• గర్భం
• డయాబెటిస్
• ఓవర్యాక్టివ్ బ్లాడర్ సిండ్రోమ్
• మధ్యంతర సిస్టైసిస్
• కణితి
• పొత్తికడుపు ప్రాంతములో పెరుగుదల  

  • కొన్ని రకాల మందుల వల్ల
    • రేడియేషన్ థెరపీ​

తరచూ మూత్రవిసర్జన కలిగే రుగ్మతకు గల  చికిత్స:

తరచుగా మూత్ర విసర్జన చేయుటకు గల సాధారణ కారణము మూత్రాశయం అధికంగా పనిచేయుట. దీనికి మీరు  నిపుణుడితో సంప్రదించి మాత్రమే సంప్రదించండి. వైద్యుడు మీ పరిస్థితిని  బట్టి మీకు చికిత్స ను తెలియచేస్తాడు, వైద్యుల ప్రకారం మందులు లేదా అదునాతన సర్జరీ లు అందుబాటులో ఉన్నాయి.

మీ సమస్యను గమనించండి :

మీరు  ద్రవపదార్ధాలు  ఎంత తీసుకున్నారు, మరియు ఎన్ని సార్లు మూత్ర విసర్జనకు వెళ్లారు తరచుగా వెళ్లిన సమయాన్ని నమోదు చేసుకోండి.

లీకేజ్, లేదా మూత్రాశయం విఫలము  అయినట్లు మీకు అనిపిస్తే, అది  నవ్వడం వల్ల కానీ, తుమ్ములు లేదా దగ్గు, మరియు మరి ఏ ఇతర  కారణం వల్లనో అని రాసి పెట్టుకోండి , ఈ సమాచారాన్ని మీరు మీ వైద్యున్ని కలిసినప్పుడు చూపించండి

మీ ఆహారాన్ని  గమనించండి జాగ్రత్తగా గమనించండి.

 

కొన్ని రకాల  ఆహార  పదార్తాలు లేదా పానీయాలు తరచూ మూత్రవిసర్జన చేసే  లక్షణాలను మరింత ఎక్కువ చేస్తాయి. ఆహారం నుండి వాటిని మినహాయించాలి.
• కాఫీ
• టీ
• చాక్లెట్

• ఆల్కహాల్
• కఫీన్ తో  కూడిన శీతలపానీయాలు
•  కెఫీన్ లేని టీ మరియు కాఫీ
• టమోటా ఆధారిత ఉత్పత్తులు మరియు టమోటాలు
• మసాలా   పదార్తాలు
• ఆమ్ల పానీయాలు మరియు ఆహారాలు
• కృత్రిమ తీపి  పదార్ధాలు  కలిగిన పానీయాలు మరియు ఆహారాలు.

0 Comments

Leave Your Comment

Submit

Book an Appointment :

Fill Out this Form for Instant Appointment.

Your information will never be shared with any thirdparty.

Order Your Personalized Diet Plan Now

Fill this form to get instant information about Diet Plans.

Your information will never be shared with any thirdparty.

This website is an informational purpose only, contact a physician or specialist doctor for your health problem.