” గణపతి బప్పా మోరియా ” కు అసలయిన అర్థం మీకు తెలుసా ?

GANAPATHI BAPPA MORIYA MEANING IN TELUGU 

Updated:31-08-2025; Author: E.Pavan Kumar, and plus100years.com team


GANAPATHI BAPPA MORIYA MEANING IN TELUGU 

మనం గణపతి నవరాత్రులలో ” గణపతి బప్పా మోరియా ” అంటూ నినాదాలు చేస్తాం ..ఇంత కూ ఈ నినాదం అర్థం ఏమిటి , ఎక్కడ మొదలయింది , ఎప్పుడు అనాలి ? ఇక్కడ తెల్సుకునే ప్రయత్నం చేద్దాం.

గణపతి బప్పా మోరియా అనే నినాదం చాల ప్రాముఖ్యం కలది ముఖ్యంగా ఈ నినాదం మహారాష్ట్రలో వాడుకలో ఉంది .

ఇది ఒక నినాదం మాత్రమే కాదు , గణపతి పట్ల మనకున్న అపారమయిన భక్తి , ప్రేమ , గౌరవం మరియు అతనిపై ఉన్న నమ్మకానికి ప్రతీక.

GANAPATHI BAPPA MORIYA MEANING IN TELUGU 

” గణపతి బప్పా మోరియా “ 3 విభాగాలుగా లోతైన అర్థం తో కూడుకున్నది ..

1. గణపతి : 

గణ + పతి = గణపతి ఈ రెండు  సంస్కృత పదాల కలయిక.

గణ అంటే సమూహం శివుని గణాలలో అనగా దేవత ల సమూహం

పతి అంటే నాయకుడు , దిశా నిర్దేశం చేసేవాడు

సంపూర్ణ అర్థం లో ” గణపతి ” అంటే దేవతలకు అధిపతి మరియు నాయకుడు

అందుకే మనం గణనాయకుడు అని పిలుస్తాం ..

2. బప్పా :

బప్పా అనేది మరాఠీ భాషలో తండ్రి అనే అర్థం వస్తుంది , ఇది ఒక ఆప్యాయ పదం .

” గణపతి బప్పా “ అని పిలిచినప్పుడు ఒక తండ్రిలాంటి ఒక ఆప్యాయత తో స్వాగతిస్తున్నాం అని అర్థం. ఇది భక్తులకు మరియు దేవుడికి ఉన్న అనుబంధాన్ని సూచిస్తుంది.

3. మోరియా :

మోరియా అనేది భక్తుని పేరు . ఇతని పూర్తి పేరు మోరియా గోసావి ఈయన పరమ గణపతి భక్తుడు ఇతను 1375 లో జన్మించాడు , ఈయనది పూణే దగ్గర  చించ్వాడ్.

అక్కడి భక్తుల ప్రకారం , పూణే కు దగ్గర ఉన్న అష్టవినాయక్ మందిరాలలో ఒకటయిన మయూరేశ్వర్ గణపతి మొరెగావ్ లో ఉంది. ఈ మోరియా గోసావి  ప్రతి రోజు ఆ గణపతి ఆలయానికి వెళ్లి గణపతి ని పూజించేవాడు , ఈయనకు ఒకరోజు గణపతి కలలో సాక్షాత్కరించి సమీపం లో ఉన్న నదిలో నా విగ్రహం ఉంది తీసుకురా అని చెప్పాడట ..అయన అలానే వెళ్లి వెతకగా అక్కడ వినాయకుని విగ్రహం దొరికింది.

ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఈయన భక్తి కి మెచ్చి “గణపతి బప్పా మోరియా” అని నినాదాలు చేయడం ప్రారంభించారట .

మోరియా అనేపదం వినాయకుని పట్ల ఉన్న అపారమయిన స్వచ్చమయిన భక్తి కి సంకేతం గా నిలుచుండిపోయింది .

గణపతి బప్పా మోరియా అనే పదానికి మొత్తం అర్థం గా ” ఓ వినాయకుడా మా తండ్రి మమ్ములను రక్షిస్తూ కాపాడు , మిమ్మల్ని మోరియా గోసావి లాగా భక్తి తో కీర్తిస్తున్నాము  అని సంపూర్ణమయిన అర్థం వస్తుంది ” 

GANAPATHI BAPPA MORIYA MEANING IN TELUGU 

గణపతి బప్పా మోరియాపుద్చ్య  వర్షి  లవకర్  యా ఈ  ప్రముఖమయిన నినాదాన్ని మనం గణపతి నిమజ్జనం రోజున పలుకుతాం “

పుద్చ్య  వర్షి  లవకర్  యా = అనేది కూడా మరాఠీ పదం దీని అర్థం మళ్ళి రా అని.

అంటే ఓ వినాయకుడా మమ్ముల్ని కాపాడే తండ్రి నువ్వు మళ్ళి వచ్చే సంవత్సరం రా ..అని ఆయనను భక్తి మరియు ఆప్యాయతతో నినదిస్తూ వీడ్కోలు పలుకుతాం ..

ఓం గం గణపతయే నమః

మీ యొక్క అభిప్రాయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి

WhatsApp : 9398601060


 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *