కార్తీక మాసం లో దీపం ఎందుకు వెలిగించాలి

కార్తీక మాసం అంటే దీపాల మాసం , మరి ఆ దీపాలను ఎందుకు మనం ఈ మాసం లో వెలిగించాలి ఇప్పుడు తెలుసుకుందాం …

“దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహః | దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ||”.
దీని అర్థం ఏంటి అంటే “దీపం అనేది పరబ్రహ్మ (అత్యున్నతమైన దివ్య జ్యోతి), అది చీకటినంతా తొలగిస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మన అజ్ఞాన్నాన్నితొలగిస్తుంది , దీపం యొక్క వెలుతురు మనకు జ్ఞానాన్ని చూపుతూ మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది .

అందుకే ఈ దీపానికి నా యొక్క నమస్కారం.”.

ఈ కార్తీక మాసం శివుడికి మరియు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం దీపం గురించి ఆలోచించినప్పుడు లో నిగూఢమయిన అర్థం దాగి ఉంది దీపం లోని నూనె మన ‘కర్మ’ దాని లో ఉండే వత్తి ‘అహం’ ఆ రెండింటినీ దైవ భక్తి అనే అగ్నితో వెలిగిస్తే, లభించేదే ‘మోక్షం’ అనే వెలుగు!

దానిలో ఉండే నూనె అనే ఇంధనం వల్ల ఆ వత్తి తనను తాను దహించుకుంటూ వెలుతురును ఇస్తుంది …
అలాగే మన లో ఉన్న అజ్ఞానపు అహంకారాన్ని కరిగించుకుంటూ జ్ఞానం అనే ఒక వెలుతురును మనలో నింపుకోవడం ..అలా మన జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవడం.

ఇంకో విధంగా చెప్పాలంటే దీపం జగన్మాత యొక్క ప్రతిరూపం , జగన్మాత ఈ జగత్తుకు తల్లి . అలా దీపాలను వెలిగించి ఆమె యొక్క ఆశీస్సులు పొందటం.

ఈ మాసం లో ప్రతిరోజు దీపాలను వెలిగిస్తూ మన జీవితాలను ఆనందంగా ఉంచుకుందాం –దీపం విలువను మన పిల్లలకు కూడా చెప్పి వారితో కూడా వెలిగింపచేద్దాం కార్తీక దీపం మనసుకి శాంతిని, ఇంటికి శుభాన్ని, ఆరోగ్య సిరిని ఇస్తుంది.
మన ఇంటిని ప్రకాశవంతం చేస్తుంది ..


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *