రొమ్ము క్యాన్సర్ లక్షణాలు మరియు రాకుండా ఉండాలంటే ఏంచేయాలి

Image

రొమ్ము కాన్సర్ – breast cancer breast cancer symptoms in telugu అనేది మహిళలలో వచ్చే ఒక రకమయిన క్యాన్సర్ దీని బారినపడి చాలామంది మహిళలు బాధపడుతున్నారు , దీని యొక్క నివారణ ఎలా మరి దీని లక్షణాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం

రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు మరియు రాకుండా ఉండాలంటే ఏంచేయాలి :

మహిళలను పట్టి పీడిస్తున్న వ్యాధులలో   రొమ్ము క్యాన్సర్ ఒకటి , భారత దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒకరు  రొమ్ము క్యాన్సర్ బారినపడుతున్నారు అలాగే ప్రతి 13 ని // మి// ల కు ఒకరు దీనివల్ల మరణిస్తున్నారు ..మరి దీని లక్షణాలు మరియు నివారణ ఎలా అన్నది  ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ..

రొమ్ము క్యాన్సర్ యొక్క  లక్షణాలు (breast cancer symptoms in telugu) :

  • రొమ్ములలో వాపు ఒకే చోట లేదా మొత్తంగా  వ్యాపించి ఉండటం 
  • రొమ్ము సొట్ట పడినట్టు ఉండటం, రొమ్ము  ఆరంజ్ కలర్ లో  కనపడటం 
  • రొమ్ములో లేదా చనుమొనల  దగ్గర నొప్పి గా ఉండటం 
  • చనుమొనలు   లోపలికి లాగినట్లు అనిపించడం 
  • రొమ్ముల చుట్టూ ఉండే చర్మం  ఎర్రగా పొడిబారినట్టు ఉండి పొలుసులు లాగ రాలిపోవడం 
  • చనుమొనల నుండి ద్రవం కారడం ,ఈ ద్రవం ఒకే రొమ్ము నుండి కారుతూ ఆ రొమ్ములో గడ్డ ఉంటె అది రొమ్ము క్యాన్సర్ అయ్యే ప్రమాదం వుంది, చాల సార్లు  ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు లేకున్నా కూడా ఇలా కారే అవకాశం వుంది ..అప్పుడు మీ కుటుంబ వైద్యుని సలహా తీసుకోండి .
  • రొమ్ముకు సంబందించిన శోషరస గ్రంధులలో వాపు ( కొన్ని సార్లు ఈ గ్రంధుల వాపు మన క్రింది చేయి మరియు మెడ చుట్టూ వాపు కానీ గడ్డ లాగ ఉండటం )

 

రొమ్ము క్యాన్సర్ స్థితి (breast cancer stages):

రొమ్ము క్యాన్సర్  2  స్థితులలో (స్టేజి) ఉంటుంది ,ఒకటి  హానికర Invasive మరియు రెండవది హానికరం కానటువంటి  Noninvasive 

హానికర  స్థితి  invasive stage : కణజాలం లో , ఇతరభాగాలలో మరియు గ్రంధులలో వ్యాప్తి చెందినటువంటిది 

హానికరం కానటువంటి  స్థితి  noninvasive satge : వాహికల  గుండా వ్యాప్తి చెందకుంటే 

 

రొమ్ము క్యాన్సర్ యొక్క దశలు ( 0 నుండి 4 )

0 దశ ( 0 stage ) :  
వైద్యులు దీన్ని హానికరం కానటువంటిదిగా పరిగణిస్తారు అయినా కూడా చికిత్స అవసరం అవుతుంది .

1 వ దశ (  1st  stage ) :
హానికరంగా భావిస్తారు ఈ దశలో కణతులు 2 సెంటి మీటర్స్  ఇంకా కొన్ని సార్లు దాని కంటే చిన్నగా ఉండే అవకాశం వుంది.

2 వ దశ :  
ఈ దశలో కణతులు మొదటి దశ కంటే పెద్దవిగా ఉంటాయి మరియు ఇది కూడా హానికరం ..
ఈ దశలో క్యాన్సర్  శోషరస గ్రంధుల వరకు వ్యాపిస్తుంది .

3 వ దశ : 
ఈ దశ కూడా హానికరమే ఈ దశలో క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు వ్యాపించదు.

4 వ దశ : 

ఈ దశలో రొమ్ము క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుంది ,ఎముకలకు , ఊపిరితిత్తులకు ,మెదడుకు , లివర్ కు వ్యాపించే ప్రమాదం వుంది .
ఈ దశలో చికిత్స అనేది క్యాన్సర్ ఇంకా వ్యాపించకుండా చూస్తూ తగ్గే తట్టుగా చేస్తారు .

 

వ్యక్తిగత కారణాలు :

కొన్ని కారణాలు క్యాన్సర్ పెరగడం మరియు వ్యాప్తిచెందటాన్ని ప్రభావితం చేస్తాయి 

  • వయస్సు 
  • హార్మోన్ల  యొక్క ప్రభావం , రుతువిరతి ( menopause ) 
  • కుటుంబ లో ఎవరికయినా ఉంటె (కుటుంబ చరిత్ర క్యాన్సర్ కు సంబంధించి) 
  • కాలుష్యం , ధూమపానం & ఆల్కహాల్ 
  • 35 సంవత్సరాల  వయస్సులో మొదటి సంతానం కలగడం వల్ల 
  • పిల్లలు కలగపోవడం వల్ల
  • శరీరం యొక్క ఎత్తు  5.8 ” ఇంకా ఎక్కువ ఉన్న వాళ్లలో 

రొమ్ము క్యాన్సర్ నివారణ ఎలా :

శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి : అధికబరువు ఎన్నో రకాల క్యాన్సర్ లకు దారి తీస్తుంది ,ముఖ్యంగా రుతువిరతి ( menopause ) తరువాత  బరువు పెరగకుండా చూసుకోవాలి .

వ్యాయామం లేదా శారీరికంగా చురుకుగా ఉండటం :

ఎన్నో పరిశోధనల ప్రకారం ఎవరయితే ప్రతి రోజు కనీసం 30 నిముషాలు వ్యాయామం చేస్తారో  వారికి క్యాన్సర్ లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

మన పనులు మనం చేసుకోవడం , రోజులో 100000 అడుగులు నడవడం అయినా చేయాలి.

పండ్లు మరియు ఆకుకూరలు / కూరగాయలు :

పోషకాహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది , 
రుతువులలో లభించే అన్ని పండ్లు మరియు ఆకుకూరలు / కూరగాయలు లను తగినంతగా తినాలి 
మీ ఆహారంలో  విటమిన్ సి , విటమిన్ డి , యాంటీఆక్సిడాంట్స్ , మరియు అన్ని రకాల పోషకపదార్తాలు ఉన్న అహారాన్ని ఎంచుకోవడం వల్ల క్యాన్సర్ ను అరికట్ట వచ్చు .

పొగాకు :

ధూమపానం  లేదా పొగాకు నమలడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది, క్యాన్సర్ రావడానికి  పొగాకు అనేది ఒక  ముఖ్యమయిన కారణం.

తల్లి పాలు పట్టడం : 

తల్లి తన పిల్లకి కనీసం ఓ ఏడాది వరకయినా  రొమ్ము పాలు పట్టడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది .తల్లి పాలు తాగడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉండగలుతాడు మరియు వారు  రోగ నిరోధకశక్తి  ని కలిగి ఉంటారు 

సంతాన నిరోధక మాత్రలు :
35 సం.. వయస్సు  దాటిన  మహిళలు సంతాన నిరోధక మాత్రలను తరచుగా వాడటం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ కు తొందరగా గురి అయ్యే  అవకాశాలు ఉన్నాయి. 

 

రొమ్ము క్యాన్సర్ కు సంబందించిన పరీక్షలు :
ఈ క్రింది పరీక్షల వల్ల రొమ్ము క్యాన్సర్ గుర్తించబడుతుంది 

 

breast cancer symptoms in telugu

  • బ్రెస్ట్ ఆల్ట్రాసౌండ్ 
  • ఏం  అర్ ఐ  ( MRI ) 
  • బయాప్సీ ( జీవధాతు పరీక్ష) 
  • CT స్కాన్ మరియు పెట్ ( PET ) స్కాన్ 

ఈ  పరీక్షల వల్ల రొమ్ము క్యాన్సర్ ను దాని దశలను మరియు వ్యాప్తి ని గుర్తించవచ్చు .ఇప్పుడు ఉన్న ఆధునిక చికిత్స పద్ధతుల ద్వారా రొమ్ము క్యాన్సర్ ను దాదాపుగా నయం చేయగలుగుతున్నాం …
చాల మట్టుకు రొమ్ము క్యాన్సర్ కు గురికాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది ..

                                                      ఆరోగ్యాన్ని కాపుడుకోండి మీ జీవితాన్ని హాయిగా గడపండి 

Note : ఈ ఆర్టికల్ మీద మీ యొక్క  అమూల్యమయిన అభిప్రాయాన్ని రాయండి 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *