Image

 

భగవాన్ రాముడి గురించి కొన్ని ఆసక్తికరమయిన విషయాలు :

 

 " ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం."

 

ఎలాంటి ఆపదలనయినా పోగొట్టే రామ నామం  ఎల్లప్పుడూ పఠనం చేయాలి ..ప్రయాణం సాఫీగా ఎలాంటి ఆపదలు లేకుండా సాగడానికి మనం చదివే ఒక ముఖ్య శ్లోకం ..

యోధ్య నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజైన దశరథుడు పరిపాలిస్తున్నాడు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు నలుగురు బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రజ్ఞుడు అని నామకరణం చేశారు.

 

1 . హిందువుల ఇతిహాసాల ప్రకారం రాముడు 1.5 మిలియన్ సంవత్సరాలకు పూర్వం  త్రేతాయుగానికి చెందినవాడు .

2 . రామ అనే పేరు పెట్టమని రాజ గురువు వశిష్ఠ మహర్షి ప్రతిపాదించాడు .రామ అనేది రెండు బీజాక్షరాల కలయిక .రా = అంటే అగ్ని  , మా = అంటే అమృతము . అగ్ని బీజము శరీరాన్ని , పరిశుద్దుడుగా ఉంచడానికి మరియు  ఆత్మ ను చైతన్యవంతం చేయడానికి  ,అమృత బీజము అతన్ని  అలసిపోనివ్వకుండా ఎల్లప్పుడూ చైతన్యవంతంగా ఉండుటకు .

 

అందుకే రామ అని కనీసం రోజు 10 సార్లు అయినా అంటే మనకు పుణ్యప్రాప్తి లభించినట్లే .

 

3 .రామచరిత మానస్ రాసిన తులసీదాస్ మహారాజ్ రాముణ్ణి సాక్షాత్తు భగవన్తునిగా అభివర్ణించాడు .

ram charith manas

4 .విష్ణు పురాణం లో రాముడు  విష్ణువు యొక్క 7 అవతారము అని చెప్పబడ్డది

5 . శ్రీరాముని  యొక్క ధనుస్సు చాల శక్తివంతమయినది , దీని ధాటికి ఎలాంటి సైన్యము నిలబడలేదు .

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యమ్ రామనామ వరాననే

6 . శ్రీరాముడు శాంతవంతుడు భార్యకు విలువ ఇచ్చే వ్యక్తి , ఒక సారి వనవాసం లో ఉన్నపుడు దండకారణ్యం  లో భార్య సీత తో ఈత పోటీలో ఉన్నప్పుడు ఆమె సంతోషం కోసం ఓడిపోయాడు ..రాముడు 14 కళలలో నేర్పరి

7 . శ్రీరాముడికి యొక్క చరిత్ర , అతి పురాతన మందిరాలు భారతదేశం లోనే కాకుండా కంబోడియా , జావా మరియు ఇండోనేసియా లలో కూడా ఉన్నాయి అంటే ప్రాచీనకాలం  నుండి  విదేశాలలో కూడా రాముడి యొక్క గాథలు విశ్వవ్యాప్తం ..

8 . శ్రీరాముడు ఇక్షాకు వంశానికి చెందినవాడు . ఈ వంశాన్ని ' ఇక్షాకు అనే రాజు స్థాపించాడు ' , ఈయన సూర్యుడి యొక్క కొడుకు అందుకే రాముడు సూర్యవంశజుడు అయ్యాడు .

9 . శ్రీరాముని సవతి తల్లియైన కైకేయి దశరథుని రెండు కోరికలు కోరింది - (1) భరతుని పట్టాభిషేకము (2) రామునకు 14 ఏండ్ల వనవాసము. ఆలా రాముడు 14 సంవత్సరాల  వనవాసం చేశాడు . ఆ చింతతో దశరథ మహారాజు కాలం చేశాడు .

10 . విష్ణు సహస్ర నామం లో రాముడి గురించి 394 వ శ్లోకం లో ప్రస్తావించబడ్డది .

11 . మహాభారతం లో కూడా రామాయణానికి సంబందించిన గాథలున్నాయి

12 . సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ. దీనిని " సీతాయాశ్చరితం మహత్ " అని వాల్మీకి అన్నాడు.

24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది

13 . రామాయణము  నీతిని నడవడికను చెప్పింది,  తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి.

అన్నదమ్ములు నిజాయితీగా మెలిగే విధానం ఎలాగో ఆచరణలో పెట్టిచూపించింది రాముని జీవితం 

రామాయణం తల్లి దండ్రులను ఎలా చూసుకోవాలో నేర్పింది మానవ జాతికి ..

14 .శ్రీరాముడి యొక్క చెల్లెలి పేరు శాంత , ఈమెను అంగ దేశ అధిపతి రోమపాదుడు దత్తత తీసుకున్నాడు .శాంతను  ఋష్యశృంగుడు కి ఇచ్చి పెళ్లి చేసారు .

15. సీత జాడ కోసం వెతికిన కొందరు మహావీరులు హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు, మైందుడు, ద్వివిధుడు, సుషేణుడు

14 . రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు) గా విభజింప బడింది.

  1. బాల కాండము
  2. అయోధ్యా కాండము
  3. అరణ్య కాండము
  4. కిష్కింధ కాండము
  5. సుందర కాండము
  6. యుధ్ధ కాండము
  7. ఉత్తర కాండము

15. రామాయణ కావ్యము వాల్మీకి  మహర్షిచే మొదట దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది

" కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్

ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్

కావ్యం రామాయణం సీతాయాశ్చరితమ్ మహత్

పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత: "

16 . శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. అదియే శ్రీరామనవమి .

17 . రామ లక్ష్మణ అన్నదమ్ములు వారి భార్యలు:  సీత-రాముడు , ఊర్మిళ- లక్ష్మణుడు , మాండవీ-భరతుడు , .

18 .  శ్రీరామ రావణ యుద్ధం లో రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి ..అప్పుడు ఇంద్రజిత్తు మాతలిని సహాయంగా పంపాడు  "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.రాముడు రావణుణ్ణి బ్రహ్మాస్త్రం తో వధించాడు ,

శ్రీరాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది.

19.రావణుణ్ణి చంపినపుడు శ్రీరాముడి వయస్సు కేవలం  42 సంవత్సరాలు


రామో విగ్రహాన్ ధర్మ :
శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మము అని వాల్మీకి మహర్షి నుడివెను 
అందువలననే " ధర్మో రక్షతి రక్షిత: " అను సూక్తి ఏర్పడింది 

20 . శ్రీరాముడు గొప్ప శివ భక్తుడు భారతావని లో చాల చోట్ల శివ లింగస్థాపన చేసాడు వాటిల్లో కొన్ని

రామేశ్వరం , కీసరగుట్ట , కూస్తాపురం ( శ్రీరామ్ సాగర్ డ్యామ్ లో మునిగి ఉంది ,ఇసుక లింగం - డ్యామ్ లో గోదావరి నీటిమట్టం తగ్గినప్పుడు అగుపడుతుంది .ఇప్పటికి చెక్కు చెదరలేదు ,తీయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు )

vanavasa route map

21.శ్రీరాముడి యొక్క సంతానం ఇద్దరు కవలలు వారి పేర్లు లవ మరియు కుశ .

22. శ్రీరాముడు అయోధ్యను 11 000 వేల సంవత్సరాలు పాలించాడు

శ్రీరాముడు మరియు రామాయణం మీద రాయబడ్డ కొన్ని ముఖ్యమయిన పురాతన మరియు ఆధునిక పుస్తకా లు

1 . వాల్మీకి రామాయణం

2 . రామ చరిత మానస్ -- తులసీదాసు రాశాడు 

3 . కంబ రామాయణ -- తమిళ్

4 . రంగనాథ రామాయణము

5 . రామాయణ కల్పవృక్షం -- విశ్వనాథ సత్యనారాయణ

6 . మొల్ల రామాయణం -- కవయిత్రి మొల్ల రాశారు

7 . ఉత్తర రామ చరితము - కంకంటి పాపారాజు

8 .   అంధ్ర వాల్మీకి రామాయణము - వావిలికొలను సుబ్బారావు (వాసుదాస స్వామి)రాశారు

10 . సుందరకాండ గాన రూపము - ఎం.ఎస్ . రామ రావు

ఇంకా ఎన్నో పరిశోధనాత్మక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ..

ఇక్కడ చర్చించిన విషయాలు సముద్రము లో నీటి బిందువు లాంటివి ...రామాయణ మహా కావ్యం కూలంకషంగా  చదివి తరిద్దాం

 

సర్వే జన: సుఖినో భవన్తు ...

 

మన తెలుగు వాళ్లందరికీ దీనిని చేరవేయండి

మీ యొక్క అభిప్రాయాలను ఇక్కడ రాయండి

WhatsApp : 9398 601060

Add new comment

CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions. Image CAPTCHA
Enter the characters shown in the image.

Home