img

దత్తాత్రేయుని అవతారము నృసింహ సరస్వతి స్వామి వారి గురించి

Description

Updated : 12-01-2024

రచయిత : ఇ.పవన్ కుమార్ శర్మ 

నృసింహ సరస్వతి స్వామి

భారత దేశం ఎందరో పుణ్య పురుషులకు నెలవైన భూమి. మనం ఇప్పుడు పుణ్య పురుషుడి యొక్క  దత్తాత్రేయ  అవతారమయిన నృసింహ సరస్వతి స్వామి వారి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం .. 

గురుచరిత్ర పారాయణ గ్రంథం  ప్రకారం నృసింహ సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ పరంపర కు చెందిన గురువు . 

ఈయన జన్మస్థలం మహారాష్ట్ర విదర్భ ప్రాంతనికి లో ఉన్న కరంజ అనే పట్టణము . 

ఈయన కు తల్లి తండ్రులు పెట్టిన పేరు నరహరి , స్వామి వారి అవతార కాలము 1378−1459 . 
స్వామి వారు  చిన్నతనం నుండే దైవచింతన కలిగి ఉండే వారు.  వారి తండ్రి పేరు మాధవ , మరియు తల్లి పేరు అంబ భవాని . 

నృసింహ సరస్వతి గొప్ప సన్యాసి మరియు గొప్ప పండితులు. ఆయన అనేక అద్భుతాలు చేశారని చెబుతారు. ఆయన యోగా మరియు ధ్యానంలో నిష్ణాతుడు. ఆయన బోధనలు నేటికీ చాలా మంది ప్రజలు అనుసరిస్తున్నారు.

నృసింహ సరస్వతి స్వామి వారు సాక్షాత్తు దత్తాత్రేయుని యొక్క రెండవ అవతారంగా పరిగణిస్తారు , మొదటి  అవతారం పిఠాపురం కు చెందిన శ్రీ పాద  శ్రీవల్లభ స్వామి . 

శ్రీపాద శ్రీ వల్లభ  స్వామి . వారి యొక్క ఆదేశం ప్రకారం అంబిక జీవితం శువుణ్ణి ఆరాధించడం లో గడిపింది , ఆమె మరు జన్మలో కారంజ పట్టణం లో ఒక సద్బ్రాహ్మణుని కుటుంబం లో జన్మించింది. ఆమె కు తల్లి తండ్రులు అంబ అని నామకరణం చేశారు ఆమెనే నృసింహ సరస్వతి స్వామి వారి మాతృమూర్తి . 

నరహరి పుట్టిన వెంటనే ” ఓం ” అనే ప్రణవనాద శబ్దాన్ని ఉచ్చారణ చేశారు . జ్యోతిష్యులు  స్వామి వారి తల్లి తండ్రులకు మీ పిల్లవాడు భగవంతుడి స్వరూపం ,అయన సన్యాసి అవుతాడు లోకానికి గురువు అవుతాడు అని తెలియచేసారు . 

ఇతను చిన్న వాడుగా ఉన్న సమయం లో ఎన్నో లీలలు చూపేవాడు , దిష్టి తగులుతుంది అని తల్లి వాటిని ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచేది ..నరహరి ఇలా ఎన్నో లీలలు చూపినాడు . 

ఒక సారి ఇనుప  వస్తువుని తాకి బంగారంగా మార్చాడు 

నరహరి కి ఏడేళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా ఓం అనే మాట తప్పితే వేరే మాటలు రాలేదు ..తల్లి ఎంత గానో బాధపడేది 

ఒకానొక సమయం లో తల్లి బాధపడటం చూసి నాకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని మొదటగా తల్లి తోనే మాట్లాడుతానని సైగలతో తెలియ చెప్పి ఉపనయనం లో భాగమయిన తల్లి బిక్షపెట్టే సమయం లో 

” భవథీ భిక్షామ్ దేహి ” అని పలికి తల్లితండ్రుల కోరికను నెరవేర్చాడు .. 

తొమ్మిదేళ్ల  వయసులో నరహరి ఇంటి నుండి బయలుదేరి కాశీ కి తీర్థయాత్రకు వెళ్లారు. స్వామి వారు ప్రతి నిత్యం మూడు పూటలా  మణికర్ణికా ఘాట్ కి వెళ్లి   గంగ లో స్నాన సంధ్యానుష్ఠానములు చేసుకునే వారు . 

ఆయన కాశీలోని ఓక  ముని శ్రీ కృష్ణ సరస్వతి వద్ద సన్యాస దీక్ష తీసుకున్నారు. ఆయన గురువు ఆయన పేరులోని రెండవ భాగాన్ని జోడించి, ఆయనను శ్రీ నృసింహ సరస్వతిగా పేరు మార్చారు.

తదనంతరము స్వామి వారు ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ లీలలు చూపిస్తూ దత్త సాంప్రదాయాన్ని భక్తులకు తెలియచేసారు . 

30 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులను కలవడానికి కరంజ  కు తిరిగి వచ్చారు. ఆయన అనేక ప్రదేశాలను సందర్శించారు 

స్వామి వారు తమ కాలం లో 

  • కాశి  
  • బద్రీనాథ్ 
  • గౌతమి నది పవిత్ర క్షేత్రాలలో సంచారం 
  • పర్లి  వైద్యనాథ్ వద్ద నివసించడం 
  • ఔదుంబర వద్ద నివసించడం (మహారాష్ట్ర )
  • నర్సోబావాడి వద్ద నివసించడం (మహారాష్ట్ర )
  • గాణ్గాపురం లో  దాదాపు 20 సంవత్సరాలు నివాసం 
  • తరువాత కదళీ వనం (శ్రీ శైలం అడవులు  ) లలో గడిపి భగవంతుని లో అంతర్ధానమయ్యారు 

కరంజ లో ని  గురుమందిర్ ఆలయం శ్రీ నృసింహ సరస్వతి స్వామికి అంకితం చేయబడింది. ఆలయం ఆయన జన్మస్థలంలో ఉంది. 

స్వామి వారు   యోగా మరియు ధ్యానంలో నిష్ణాతుడు. ఆయన బోధనలు నేటికీ చాలా మంది ప్రజలు అనుసరిస్తున్నారు.

స్వామి వారిని ఎలా కొలవాలి :

గురుచరిత్ర పారాయణం చేయడం 
నృసింహ సరస్వతి అష్టకం చదవడం 
దత్తాత్రేయ వజ్రకవచం చదవడం 
దత్తాత్రేయుని హోమం చేయడం 
ఇంకా దత్తాత్రేయని  స్తుతించడం 

” దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర – బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర” మంత్రాన్ని  జపించడం 
 

ఇది కూడా వీలయితే చదవండి  లలితా సహస్రనామం యొక్క ప్రయోజనాలు మరియు చదివే విధానం (శుభ ఫలితం కోసం )
 

కరంజకు ఎలా వెళ్ళాలి 

కరంజ లోని గురుమందిర్ ను దర్శించడం లోని అనుభూతి మాటలలో చెప్పలేనిది ,ఆ మహత్బాగ్యం కోసం మీరు గురుమందిర్ (కరంజ ) కు వెళ్ళాలి అనుకుంటే 

  1. భాగ్యనగరం నుండి దాదాపు 550 కిమీ  , ఉంటుంది 
  2. రోడ్డు మార్గం లో అయితే నిర్మల్ , ఆదిలాబాద్ , యావత్మాల్ నుండి లాడ్ కరంజ 
  3. మరియొక  రోడ్డు మార్గం నిర్మల్ , మాహూర్ , డిగ్రాస్ నుండి  లాడ్ కరంజ 
  4. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ మూర్తిజాపూర్ ఇక్కడి నుండి కరంజ లాడ్  30 కిమీ.
     

మీ యొక్క  సూచనలు సలహాలు మరియు దత్తాత్రేయుని ఆరాధన సలహాల కోసం :

వాట్సాప్ : 9398601060
 

Posted By Plus100years / January 12, 2024

Shares

Latest Posts

Subscribe To Our Newsletter

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor