ప్రతి తల్లి తండ్రులు ఒక సారి చదివి మీ పిల్లలకోసం ఆచరించాల్సిన అతి ముఖ్యమయిన విషయాలు . 

health tips in Telugu

Updated : 21-12-2023

రచయిత : ఇ .పవన్ కుమార్ ( Founder- plus100years.com ) & www.plus100years.com 

1. ఏది నిజం/అబద్ధం అని మీ పిల్లలకు చెప్పండి?  వాళ్ళ వయస్సుకు సంబంధించి నిజం ఏంటి అబద్దం ఏంటి చెప్పండి . 

2. చదువుతో పటు జ్ఞానం వచ్చినప్పుడే ఆ చదువు కు సార్థకత  లేదంటే పిల్లలు చదువుకున్నమూర్ఖులు  తయారవుతారు.

3. దశావతారానికి జీవ పరిణామానికి గల సంబంధం ఏమిటో మీ పిల్లలకు చెప్పండి?
దశావతారాలకు సంబందించిన  కథలను చెప్పండి. 

4. ధృవ, ప్రహ్లాద, శ్రవణ, నచికేత, అష్ట్రవక్ర,  గురించి మీ పిల్లలకు చెప్పండి. ఆది శంకరాచార్యులు , వాల్మీకి ,షట్చక్రవర్తులు , గురునానక్ , మరియు  సప్తఋషుల గురించి చెప్పండి. 

5. రామాయణ , భారత కథలను వివరించి చెప్పండి ..వాటిలో ఉన్న పాత్రల గురించి చెప్పండి.

6. వేద పదం అంటే ఏమిటో మీ పిల్లలకు చెప్పండి.  వేదాలు ఎన్ని వాటి గురించి అర్థం అయ్యే రీతిలో చెప్పండి . 

7. భారతీయ సాంప్రదాయాల గురించి చెప్పండి  ,ముఖ్యంగా  బొట్టు  , విభూతి , గంధం ఎందుకు పెట్టుకోవాలి వాటికి  ఉన్న ప్రాముఖ్యతను తెలియచేయండి . గాజులు ఎందుకు వేసుకోవాలి వాటి వెనుకున్న సైన్స్ చెప్పండి . 

8. దేవతార్చన ఎందుకు చేయాలి ఎలా చేయాలో నేర్పండి.

9. మీ పిల్లలకు సంస్కృతం నేర్పండి.ముందుగా  చిన్న పదాలు నేర్పండి ..ఆన్ లైన్ లో కూడా చెప్తున్నారు .

10. ఇంట్లో పెద్ద వాళ్ళ కు వచ్చి పోయే బందు మిత్రులకు విలువ ఎలా ఇవ్వాలో నెర్పించండి.

11.ఇల్లు ను శుభ్రం గా ఎలా ఉంచాలో నేర్పించండి. 

12. దేహాన్ని పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి మెల్లిగా అర్థం అయ్యే తీరు గా చెప్పండి స్నానము ఎలా చేయాలి , ఎలా దువ్వు కోవాలి ఇలాంటివి.

13. హుందాతనాన్ని చూపించే బట్టల యొక్క అవసరాన్ని చెప్పండి.

14. మంచి ఆహారం యొక్క విలువ అది మన భవిష్యత్తు ఆరోగ్యానికి ఎలా ఉపయోగ పడుతుందో చెప్పాలి. 

15. యోగ , ధ్యానం గురించి తెలియ చేయాలి.  

16. మంచి భావము తో ఉన్న జానపద పాటలను నేర్పించండి.

17. భగవద్గీత యొక్క శ్లోకా లను ఒక దాని తరువాత ఒకటి నేర్పించండి మరియు వాటి అర్థాన్ని వాళ్ళ వయస్సును దృష్టిలో పెట్టుకుని వివరించండి . బయట వారాంతపు క్లాసులలో నేర్పించండి ..రామ కృష్ణ మిషన్ మరియు ఆన్లైన్ లో కూడా నేర్పిస్తున్నారు 

 

మీ యొక్క అమూల్య మయిన సూచనలు మరియు సలహాలు ఇక్కడ కామెంట్ బాక్స్ లో రాయండి 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *