img

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రభుత్వం చెప్పిన ఆయుర్వేద సలహాలు

Description

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రభుత్వం చెప్పిన ఆయుర్వేద సలహాలు

ఆయుర్వేదం అతి ప్రాచీన చికిత్సా పద్ధతి ,ఆయుర్వేదం ఎన్నో వ్యాధులను రానీయకుండా కాపాడుతుంది

దినచర్య మరియు ఋతుచర్య

ఆయుష్ మినిస్ట్రీ ప్రకారం

ప్రతి దినం లో చేసేవి :

1 దినం లో తరచుగా గోరు వెచ్చని నీటిని తాగాలి .
2 ప్రతి రోజు 30 నిముషాలు యోగ / ప్రాణాయామం చేయండి
3  వంటలలో ప్రతి రోజు వీటిని వాడండి : పసుపు , ధనియాలు (ధనియాల పొడి ),వెల్లి మరియు జిలకర .

ఆయుర్వేద ప్రకారం రోగ నిరోధకశక్తి ని ఇలా పెంచుకోండి :

1 – చవనప్రాశ్ 1  చిన్న చెంచా (10 గ్రాములు) ప్రొదున , మధుమేహం ఉన్నవారు చక్కర లేని చవనప్రాశ్ ను వాడాలి .

2 – హెర్బల్ టీ / డికాక్షన్ (కాడ) వీటితో చేసుకోండి  :తులసి , దాల్చిని , నల్ల మిరియాలు ,శొంఠి ,ఎండిన ద్రాక్ష మరియు  బెల్లాన్ని చేర్చి టీ ని తయారు చేసుకొని రోజుకు 2  సార్లు త్రాగండి , రుచి కోసం నిమ్మ రసాన్ని కలువుకోండి

3 గోల్డెన్ మిల్క్ / బంగారు పాలు : వేడి పాలలో 1 చెంచా పసుపు కలుపుకుని  1 లేదా 2 సార్లు   తాగండి

ఇంకా కొన్ని పాటించాల్సినవి

నాసల్ థెరపీ ( ప్రతిమార్ష నస్య ) : నువ్వుల నూనె కానీ , కొబ్బరి నూనె కానీ లేదా నెయ్యి ని ముక్కు రంద్రాలలో ఒక్క చుక్క ప్రొద్దున మరియు సాయంత్రము వేసుకోండి .

ఇది నిపుణుల వద్ద చేయడం ఉత్తమ్ .

ఆయిల్ పుల్లింగ్ థెరపీ :ఒక చెంచా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను నోట్లో 2  లేదా 3 నిముషాలు  పుక్కిలించి ఉమిసేయాలి తరువాత గోరు వెచ్చని నీటిని పుక్కిలించి ఉమిసేయాలి  ఇలా రోజుకు 1 లేదా 2 సార్లు చేయాలి .
 

పొడి దగ్గు , గొంతు నొప్పి ఉన్నపుడు :

1 పుదీనా లేదా ఓమ (వాము ) ను వేడి నీటిలో మరిగించి ఆ ఆవిరిని నెమ్మదిగా పీల్చుకోవాలి ,ఇలా రోజుకు ఒక్కసారి చేయాలి .

2 లవంగం పొడి ని కొద్ది చక్కర / తేనే లో కలిపి తినాలి ఇలా 2 లేదా 3 సార్లు  తీసుకోండి .

ఈ పద్ధతులు అన్ని రోజు  తరచుగా వచ్చే దగ్గు కు సంబందించినవి , మీ యొక్క డాక్టర్ ను సంప్రదించండి అత్యుత్తమ చికిత్స కోసం .

గమనిక : దయచేసి పై వివరాలు , పద్ధతులు , సహజ ఇంటి చికిత్స లు కరోనా వైరస్ , కోవిద్ 19 చికిత్స కోసం కాదు , మన ఇమ్మ్యూనిటి / రోగ నిరోధకశక్తిని పెంచడానికి సూచించ బడ్డాయి .

source: https://www.mohfw.gov.in/pdf/ImmunityBoostingAYUSHAdvisory.pdf

Posted By Plus100years / April 18, 2023

Shares

Latest Posts

Subscribe To Our Newsletter

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor