బ్లడ్ ప్రెషర్ ని తెలుగులో రక్తపోటు అంటాము , ప్రపంచం మొత్తం మీద ఈ రక్తపోటు కు సంబందించిన వ్యాధులతో 7.5 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి ,ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూ పోతోంది ..
బ్లడ్ ప్రెషర్ ని తెలుగులో రక్తపోటు అంటాము , ప్రపంచం మొత్తం మీద ఈ రక్తపోటు కు సంబందించిన వ్యాధులతో 7.5 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి ,ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూ పోతోంది ..
రక్తపోటు అనేది అధిక రక్తపోటు లేదా అల్ప రక్తపోటు అయిఉంటుంది , ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో ఇది సహజమయిన స్థితిలో ఉంటుంది .
ఇప్పుడు రక్తపోటు అంటే ఏమిటో తెలుసుకుందాం ..
గుండె కు రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలు అధిక ఒత్తిడికి గురిఅవుతూ రక్తాన్ని గుండెకు చేరవేయడాన్ని అధిక రక్తపోటు అంటాము ఈ రక్తనాళాలు రక్తాన్ని తగిన మొత్తం లో గుండెకు చేరవేయడానికి చాల కష్టపడుతూ ఉంటాయి . కొన్ని రకాల కారణాల వల్ల ఇవి కుంచించుకు పోయి గుండెకు చేరాల్సిన రక్తాన్ని అడ్డుకుంటాయి దీని వలన గుండె నొప్పి ఇంకా ఇతర సమస్యలు ఉత్పన్నం అవుతాయి .
అధిక రక్తపోటు ఈ రోజులలో 25 సం // వయసు వారికీ కూడా వస్తున్నది దీనికి చాల కారణాలు ఉన్నాయి , ఈ అధిక రక్తపోటు వల్ల గుండెపోటు ,గుండెకు సంబందించిన అనారోగ్యాలు , మూత్రపిండాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది .
అధిక రక్తపోటు లక్షణాలు ముందుగా పసిగట్టడం వల్ల చాల ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు .
ఇంకా కొన్ని సార్లు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే అధిక రక్తపోటు కు గురి అయ్యే అవకాశం ఉంది ,
వైద్యులు రక్తపోటు కొలవడానికి రెండు సంఖ్యల పరిమాణాలు/కొలతలు చూస్తారు
1 –సిస్టోలిక్ పీడనం
2 — డయాస్టోలిక్ పీడనం
ఈ కొలతలు 120 నుండి 139 mm Hg ( సిస్టోలిక్ పీడనం) / 80 నుండి 89 mm Hg (డయాస్టోలిక్ పీడనం) వరకు ఉంటె అధిక రక్తపోటు కు దగ్గరగా ఉన్నట్టు .
ఈ కొలతలు140 / 90 mm Hg కి సమానంగా లేదా ఎక్కువగా ఉంటె అధిక రక్తపోటు గ వైద్యులు భావిస్తారు ,
ఈ కొలతలు కచ్చితంగా తెలుసుకోవడాని మీ కుటుంబ వైద్యున్ని లేదా కార్డియాలజిస్ట్ ను సంప్రదించండి
అధిక రక్తపోటు ఉంది అని రక్తపోటు ను కొలిచే సాధనంతో కొలుస్తారు , దీంట్లో రీడింగ్
120 / 80 కంటే ఎక్కువగా పలు మార్లు (వివిధ సమయాలలో తరచుగా )వచ్చినప్పుడు అధిక రక్తపోటు గా భావిస్తారు ,
ఈ పై కారణాల వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది ,
మన యొక్క అలవాట్లను మార్చుకుని దీన్ని అదుపులో పెట్టవచ్చు :
(మన శరీరానికి తగినంత నీటిని త్రాగడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది)
అవిసె గింజలు
వీటిలో ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి .
ఇవి ఉన్న ఆహారపదార్తాలు తినడం వల్ల కూడా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది ,
ఇవి తృణధాన్యాలలో , ఆకుకూరలలో, సెనగలు , నిమ్మ జాతి పండ్లు ,అరటిపండ్లు మరియు మొలకెత్తిన విత్తనాలు.
ప్రతి రోజు తప్పకుండ 40 నిముషాలు నడవాలి లేదా ఏదయినా శారీరక వ్యాయామం చేయాలి
ప్రతి దినం 15 నిముషాలు అయినా ధ్యానం చేయాలి – శ్వాసకు సంబందించినవి .
ఇలా చేస్తే అధిక రక్తపోటు సమస్యను అధిగమించవచ్చు
అధిక రక్తపోటు ఉంటె మీ వైద్యుని సలహా ప్రకారం మందులు వేసుకోండి , తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి , అధిక రక్తపోటు ను అదుపు చేసే ఆహారాన్నే తినండి .