img

వీటిని మీరు ఎప్పుడు తినలేదా అయితే తప్పకుండ తినండి !.

Description

ఈ ఆహారపదార్తాలు తింటే మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి ,వీటిని తినడం వల్ల బరువుపెరగడం , కాన్సర్ రాకుండా కాపాడుకోవడం ,మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం తేలికగా అవుతుంది

 

1 – గుమ్మడి కాయ :

గుమ్మడి కాయ తినటం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్స్ , మినరల్స్ మరియు యాంటియోక్సిడెంట్స్ అందుతాయి.

దీనిలో విటమిన్ ఏ, సి సమృద్ధిగా ఉంటాయి , అందుకే మీ ఆహారం లో గుమ్మడి కాయని చేర్చండి.

ఇది బరువు తగ్గడానికి కూడా పనికొస్తుంది .

గుమ్మడి కాయలో ఉండే గింజలు కాన్సర్ రాకుండా కాపాడుతాయి

 2 – ఓట్స్ :

ఓట్స్ ని భూమి మీద ఉన్న అత్యుతమ ధాన్యంగా పరిగణిస్తాము .

వీటిలో పీచు పదార్థము అత్యధికంగా ఉంటుంది , పీచు పదార్తాలు తినడం వల్ల కాన్సర్ , హృద్రోగము ,మధుమేహము రాకుండా కాపాడుకోవచ్చు  మరియు జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది .

వీటి తో ఎన్నో రకాల ఆహార పదార్తాలు తయారుచేసుకోవచ్చు

దింట్లో జింక్ , ఐరన్ , విటమిన్ బి 1 , బి 5 ఇంక ఎన్నో ఉంటాయి.

ఓట్స్ పిల్లలకు మరియు పెద్దలకు కూడా మంచి పోషకాహారం

3 – రాగులు :

మధుమేహం ఉన్న వాళ్ళు మరియు మధుమేహం వచ్చే అవకాశం ఉన్న వాళ్లకు దేవుడు ఇచ్చిన అద్భుతమయిన ఆహారం రాగులు.
రాగులు చిరుధాన్యాల కింద కి వస్తాయి .
దీంట్లో కాల్షియం అత్యధికంగా ఉంటుంది ,రాగులు వాడటం మహిళలకు చాల ఉత్తమం .రక్త హీనతతో బాధపడే వాళ్లకు రాగి ఉత్తమమయిన ఆహారం ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
ప్రతిరోజూ రాగులను ఏదో ఒక విదంగా  ఆహారం లో చేర్చడం తప్పనిసరి చేసుకోండి 

4 – ఉసిరికాయ : 

ఆయుర్వేదం  ఉసిరికాయ ను దివ్యౌషధం గ పరిగణిస్తుంది  , దీంట్లో విటమిన్ సి ఉంటుంది ఇది మన శరరీరానికి కావలసిన రోగనిరోధక శక్తిని ఇస్తుంది .
చర్మానికి , వెంట్రుకలకు మంచి పోషణను ఇస్తుంది .ఎల్లప్పుడూ ఆరోగ్యం గ ఉండలాంటే ఉసిరికాయలను తినండి .
దింతో జ్యూస్ కానీ , చట్నీ కానీ ఏదయినా చేసుకోవచ్చు .
మర్చి పోకండి ఆరోగ్యం అనేది మీ చేతుల్లోనే ఉంది

Posted By Plus100years / April 18, 2023

Shares

Latest Posts

Subscribe To Our Newsletter

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor