1. సంపూర్ణ ఆరోగ్యం కోసం నడవండి : రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగవుతుంది ,గుండె ,ఊపిరితిత్తు ల పనితీరు , మధుమేహం నియంత్రణ , బరువు తగ్గడం , శరీరం మొత్తం రక్త ప్రసరణ బాగా జరగడం , కండరాల ఆరోగ్యం కోసం నడక సహాయపడుతుంది.
2. క్రమం తప్పకుండ నడవాలి : వారానికి కనీసం 5 రోజులు నడవడం అలవాటు చేసుకోవాలి , ప్రతిరోజు 30 నిమిషాల నడకకు ప్రాధాన్యం ఇవ్వాలి . నడకను 10 నిమిషాల వ్యవధి ప్రకారం నడిచినా పర్వాలేదు .
3. సరిఅయిన పాదరక్షలు : నడకకు సౌకర్యవంతమైన పాదరక్షలు ధరించండి లేదంటే పాదాలకు గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది . సరయిన సైజు , తేలికగా ఉండేవి , జారనివి వేసుకోవాలి .
4. మంచి గడ్డి ఉంటె కాలుకి గాయాలు లేకుంటే పాదరక్షలు తీసి కూడా నడవవచ్చు ఇది ఇంకా మేలు చేస్తుంది ,కానీ మన ఆరోగ్యం అలవాటు ప్రకారం నడవాలి .
5. నిటారుగా నిలబడి , ముందుకు చూస్తూ నడవాలి , మీ చేతులను మరియు భుజాలను తేలిక వదిలి నడవాలి …శరీరాన్ని బిగ పట్టి నడవరాదు .
6. నడిచే దారిలో ఇబ్బంది లేకుండా చూసుకోండి ..ట్రాఫిక్ ఉన్న దారిలో , బండలు ఉన్న దారిలో , ఎక్కువ జన సమ్మర్ధం ఉన్న దారిలో నడకవల్ల మనం అనుకున్న ఫలితాన్ని పొందలేము .
7. పట్టణాలలో క్రీడా మైదానంలో నడకకు ఉన్న దారిలో నడవడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి
8. నడకను ఒంటరిగా అయినా లేదంటే కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో నడవాలి ..ఒకటి మాత్రం పాటించాలి నడిచే టప్పుడు ఎలాంటి చెడు భావాలు మనసు లో ఉంచుకోకుండా నడవాలి …
9. జంతువులు ముఖ్యముగా కోతులు ఉన్న ప్రదేశంలో నడవకండి అవి దాడి చేసే ప్రమాదం ఉంది .
10. మనస్సును నడకమీదనే లగ్నం చేసి నడవాలి .. నడకను ప్రశాంతంగా ఆస్వాదించాలి
11. నడక సమయం లో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది అందుకే స్వచ్చమయిన గాలి లభించే ప్రదేశం లో నడవాలి .
12. నీటిని త్రాగడం : నడకకు ముందు నీటిని త్రాగండి మళ్ళి మధ్యలో విశ్రాంతి తీసుకుని నీటిని త్రాగండి . నడక సమయం లో శరీరం లో నీరు తగినంతగా లేకుంటే అలసట కు గురిఅవుతుంది
13. నడుస్తున్నప్పుడు చరవాణిలో మాట్లాడటం చేయకండి మనస్సును నడక మీద , నడిచే దారి మీద దృష్టి పెట్టండి.
14. తిన్న 1 గంట తరువాత నడవడం ఉత్తమం ., ఎక్కువగా భోజనం చేసిన వెంటనే నడవరాదు
తప్పక చదవండి : వేగంగా నడవడం వల్ల మధుమేహం ను నియంత్రించవచ్చా
15. ఎక్కువ చలిగా ఉన్నపుడు , మంచు ఎక్కువ గా ఉన్నపుడు , వర్షం లో , ఎక్కువ ఎండ ఉన్నపుడు నడవడం మంచిది కాదు .
16. గాలి ఆడని దుస్తులు వేసుకుని నడవరాదు , కాటన్ దుస్తులు వేసుకోవాలి .
17. నడకను మొదలు పెట్టే టప్పుడు వీలయితే శరీరాన్ని కదిలించే వ్యాయామాలు చేయాలి తరువాత నడకను ఆరంభించండి .. –
18. అనారోగ్యం తో బాధపడుతున్నప్పుడు నడకకు పోక పోవడమే ఉత్తమం …అంటే బలవంత గా శరీరాన్ని కష్టపెట్టి నడకను చేయకండి .
19. ఎక్కువ అలసట వస్తున్నప్పుడు , ఎక్కువ చమట పట్టినప్పుడు , శరీరం లో ఏదయినా భాగం లో నొప్పి వస్తున్నప్పుడు నడకను చేయకండి .
20. నడక అయిన తరువాత కొద్ధి సేపు విశ్రాంతి లో ఉండండి ..మౌనంగా….
21. నడక అయిన తరువాత 15 నిమిషాలు అయ్యాక స్నానం చేయండి