మనం చాలాసార్లు కొందరిని చూసి వాళ్ళ లాగా ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాం
మరి వాళ్ళు ఆలా ఎందుకు ఉండగలుగుతారో ఇప్పుడు తెల్సుకుందాం
ఒత్తిడిని నియంత్రించండి
మనము ఉత్సాహంగా ఉండకపోవడానికి ప్రధాన కారణం ఒత్తిడి …మనం ఒత్తిడి లో ఉన్నపుడు మన శక్తి ని చాల కోల్పోతుంటాం …
ఒత్తిడి-ప్రేరిత భావోద్వేగాలు భారీ మొత్తంలో శక్తిని వినియోగిస్తాయి. స్నేహితుడితో లేదా బంధువుతో మాట్లాడటం, ధ్యానం చేయడం , వ్యాయామం చేయడం , మనకు ఇష్టమయిన పని చేయడం లాంటివి ఒత్తిడిని దూరం చేయడంలో సహాయపడతాయి. మరియు తాయ్ చి వంటి విశ్రాంతి చికిత్సలు కూడా ఒత్తిడిని తగ్గించడానికి సమర్థవంతమైన సాధనాలు..
ఒత్తిడిని అధిగమిస్తే దాదాపు అన్ని రోగాలను అదుపులో పెట్టినట్టే …
మీ భారాన్ని తగ్గించుకోండి
అలసటకు ప్రధాన కారణాలలో ఒకటి అధిక పని. అధిక పని వృత్తిపరమైన, కుటుంబ మరియు సామాజిక బాధ్యతలను కలిగి ఉంటుంది. మీరు “తప్పక చేయవలసిన” కార్యకలాపాల జాబితాను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించండి. అత్యంత ముఖ్యమైన పనుల పరంగా మీ ప్రాధాన్యతలను సెట్ చేయండి. తక్కువ ప్రాముఖ్యత లేని వాటిని తగ్గించండి. అవసరమైతే, పనిలో అదనపు సహాయం కోసం అడగండి.
ప్రణాళిక ప్రకారం పనిచేయడం వల్ల మనం ఆనందంగా ఉండగలుగుతాం
ఇది కూడా చదవండి బరువు తగ్గడానికి అద్భుతమయిన సహజమయిన సూత్రాలు
శారీరక శ్రమ :
వ్యాయామం లేదా ఏదయినా శారీరక శ్రమ కలిగిన పనులు చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది ..సరయిన నిద్ర వల్ల ఆరోగ్యం బాగుండి ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు
వ్యాయామం మీకు మరింత శక్తిని ఇస్తుంది మరియు ఆక్సిజన్‌ను ప్రసరింపజేస్తుంది. మరియు వ్యాయామం చేయడం వల్ల మెదడు డోపమైన్ స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది, ఇది మానసిక స్థితిని పెంచడంలో సహాయపడుతుంది. నడుస్తున్నప్పుడు, మీరు ప్రతి రోజు ౩౦ నిముషాలు నడవడం వల్ల కూడా ఇలాంటి లాభాన్ని పొందుతారు
దురలవాట్లకు దూరంగా ఉండటం
పొగ త్రాగడం , మద్యపానం , తంబాకు ,గుట్కా నమలడం అన్ని మీ శక్తిని తగ్గించి వేస్తాయి …
దీర్ఘకాలంగా ఈ అలవాట్లు ఉన్నవారు ఏదో ఒకరకమయిన వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది ..
క్యాన్సర్ , సడన్ హార్ట్ స్ట్రోక్ , పక్షవాతం , కిడ్నీ సమస్యలు , గుండె లో మంట , మధుమేహం , లివర్ సమస్య ఇలా ఎన్నో చెడు అలవాట్ల వల్ల కలిగే సమస్యలు …
ఈ అలవాట్లు లేని వాళ్ళు ఎనర్జిటిక్ గా ఉంటారు
ఆహారం ..
మంచి సరయిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యం గా ఉత్సాహంగా ఉంటారు …
ఆ ఆ రుతువులలో తినే ఆహారం వల్ల మనకు శక్తి లభిస్తుంది …
ఇది కూడా చదవండి బూడిద గుమ్మడి వల్ల 14 ఆరోగ్య ప్రయోజనాలు